ఇప్పుడు విలన్‌ పాత్రలదే ట్రెండ్‌ | Actor Suman Special Chit Chat With Sakshi Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఇప్పుడు విలన్‌ పాత్రలదే ట్రెండ్‌

Published Mon, Nov 5 2018 7:02 AM | Last Updated on Sat, Nov 10 2018 1:14 PM

Actor Suman Special Chit Chat With Sakshi Visakhapatnam

గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): ప్రస్తుతం విలన్‌ పాత్రల ట్రెండ్‌ నడుస్తోందని అంటున్నారు ప్రముఖ సినీ నటుడు సుమన్‌. ట్రెండ్‌ బట్టి తను పాత్రలు పోషిస్తున్నట్లు చెప్పారు. హీరో పాత్రలోనే కొనసాగాలన్నది ఇప్పుడున్న ట్రెండ్‌ కాదని, రాజమౌళి లాంటి డైరెక్టర్ల దర్శకత్వంలో హీరోలు సైతం విలన్‌ పాత్రలకు ఎదురుచూస్తున్న పరిస్థితులు వచ్చాయన్నారు. హీరో పాత్ర కంటే విలన్‌ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉండడం, అందులో దమ్మున్న క్యారెక్టర్లకు జనాదరణ ఉండంతో అటువైపు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిపారు. గోపాలపట్నం కొత్తపాలెంలో ఆదివారం ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. తన సినీ అనుభవాలు, సినిమా విజయవంతానికి పాత్రల ప్రాధాన్యం ఎంత ముఖ్యమో వివరించారు.

హీరో పాత్రకు వయసు బట్టే ఆదరణ
ఎపుడూ హీరో పాత్రలకు వయసుని బట్టే ఆదరణ ఉంటుంది. కాలం మారితే హీరోలు మారుతుంటారు. ఏ పాత్ర బాగుంటే అందులోనే హీరోయిజాన్ని చూడాలి. కుటుంబాన్ని మోసే తండ్రి పాత్ర కూడా హీరోయే. నేను నిర్మాతలు ఇచ్చే పారితోషకాలకు కంటే పాత్రలకే ప్రాధాన్యం ఇస్తాను. అలాంటి పాత్రలు చాలా సంతృప్తినిస్తాయి.

రజనీకాంత్‌కు విలన్‌గా చేశా..
అగ్రహీరోలు కూడా విలన్‌ పాత్రలు పోషించడానికి ఎదురు చూస్తున్నారు. తెలుగు సినిమాల్లో హీరోలు విలన్‌గా నటిస్తున్నారు. నేను శివాజీ చిత్రంలో రజనీకాంత్‌కు విలన్‌గా చేశాను. మంచి పేరు వచ్చింది. మళ్లీ అలాంటి పాత్రల కోసం ఎదురు చూస్తున్నా. నా స్థాయికి తగ్గ హీరో ఉంటే విలన్‌ పాత్రలు పోషిస్తా. రాజమౌళి లాంటి దర్శకుల సినిమాల్లో విలన్‌ పాత్రలకు ప్రాధాన్యం పెరిగింది. బాహుబలి–2 చిత్రంలో హీరో రానాకు విలన్‌గా ఎంతో పేరు వచ్చింది.

సందేశం ఉంటే హీరోగా చేస్తా..
హీరో పాత్రలో తగిన కథ ఉంటే నటిస్తాను. అది సామాజిక సందేశాన్ని ఇచ్చేలా ఉండాలి. ప్రజల హృదయాలను కదిలిం చాలి. కుటుంబ సంబంధాలు కూడా కమర్షియల్‌ బంధాలయిపోతున్న ఈ రోజుల్లో సమాజానికి మంచి సందేశాన్నిచ్చే క్యారెక్టర్‌ ఉంటే హీరోగా నటిస్తాను.

రాష్ట్రపతి నా సినిమా చూశారు
ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా.. సాధారణ కుటుంబం నుంచి వచ్చి సినీ పరిశ్రమ ప్రేక్షక ఆదరణ పొందాను. ఇంతకంటే అదృష్టం ఏం కావాలి. హీరోగా 150 చిత్రాల్లో నటించాను. మొత్తంమ్మీద క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా 400 పైగా సినిమాల్లో నటించాను. అన్నమయ్య చిత్రంలో వేంకటేశ్వరస్వామి పాత్రలో మెప్పించిన నన్ను మాజీ రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మ పిలిచి విందు ఇచ్చారు. నాతో కలసి ఆ సినిమా చూశారు. సినీ పరిశ్రమలో ఇదో అపురూప అవకాశం. ఇంతకంటే సంతృప్తి ఏం కావాలి.

ప్రస్తుతం చాలా బిజీ
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో మంచి పాత్రలు వస్తున్నాయి. ఆయా రంగాల్లోని సినిమా షూటింగ్‌లతో బిజీలో ఉన్నాను. ఇందులో తెలుగు, తమిళ్‌ చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి.
వయసు అనుభవాలను నేర్పుతుంది.

ప్రస్తుత సినీ రంగంలో సినిమా హిట్‌ అయితే మాదే గొప్ప అని పొంగిపోవడం, లేకపోతే కుంగిపోవడం, ఫెయిల్యూర్‌ని డైరెక్టర్‌పైనో మరెవరిపైనో నెట్టేయడం కనిపిస్తోంది. సక్సెస్‌ వస్తే ఆ చిత్రానికి అంతా తామే అని అంటున్నారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ జీవితాలను చూస్తే వారు ఎన్నో ఆటుపోట్లు అధిగమించారు. అందుకే విజయాలను చూసి ఎక్కువ సంతోషపడకూడదు. ఓటమిని భరించాలి. సినిమా సక్సెస్‌/ఫెయిల్యూర్‌ అందరిది. 

పోషించడానికి ఎదురు చూస్తున్నారు. తెలుగు సినిమాల్లో హీరోలు విలన్‌గా నటిస్తున్నారు. నేను శివాజీ చిత్రంలో రజనీకాంత్‌కు విలన్‌గా చేశాను. మంచి పేరు వచ్చింది. మళ్లీ అలాంటి పాత్రల కోసం ఎదురు చూస్తున్నా. నా స్థాయికి తగ్గ హీరో ఉంటే విలన్‌ పాత్రలు పోషిస్తా. రాజమౌళి లాంటి దర్శకుల సినిమాల్లో విలన్‌ పాత్రలకు ప్రాధాన్యం పెరిగింది. బాహుబలి–2 చిత్రంలో హీరో రానాకు విలన్‌గా ఎంతో పేరు వచ్చింది.

సందేశం ఉంటే హీరోగా చేస్తా..
హీరో పాత్రలో తగిన కథ ఉంటే నటిస్తాను. అది సామాజిక సందేశాన్ని ఇచ్చేలా ఉండాలి. ప్రజల హృదయాలను కదిలిం చాలి. కుటుంబ సంబంధాలు కూడా కమర్షియల్‌ బంధాలయిపోతున్న ఈ రోజుల్లో సమాజానికి మంచి సందేశాన్నిచ్చే క్యారెక్టర్‌ ఉంటే హీరోగా నటిస్తాను.

రాష్ట్రపతి నా సినిమా చూశారు
ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా.. సాధారణ కుటుంబం నుంచి వచ్చి సినీ పరిశ్రమ ప్రేక్షక ఆదరణ పొందాను. ఇంతకంటే అదృష్టం ఏం కావాలి. హీరోగా 150 చిత్రాల్లో నటించాను. మొత్తంమ్మీద క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా 400 పైగా సినిమాల్లో నటించాను. అన్నమయ్య చిత్రంలో వేంకటేశ్వరస్వామి పాత్రలో మెప్పించిన నన్ను మాజీ రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మ పిలిచి విందు ఇచ్చారు. నాతో కలసి ఆ సినిమా చూశారు. సినీ పరిశ్రమలో ఇదో అపురూప అవకాశం. ఇంతకంటే సంతృప్తి ఏం కావాలి.

ప్రస్తుతం చాలా బిజీ
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో మంచి పాత్రలు వస్తున్నాయి. ఆయా రంగాల్లోని సినిమా షూటింగ్‌లతో బిజీలో ఉన్నాను. ఇందులో తెలుగు, తమిళ్‌ చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి.
వయసు అనుభవాలను నేర్పుతుంది.

ప్రస్తుత సినీ రంగంలో సినిమా హిట్‌ అయితే మాదే గొప్ప అని పొంగిపోవడం, లేకపోతే కుంగిపోవడం, ఫెయిల్యూర్‌ని డైరెక్టర్‌పైనో మరెవరిపైనో నెట్టేయడం కనిపిస్తోంది. సక్సెస్‌ వస్తే ఆ చిత్రానికి అంతా తామే అని అంటున్నారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ జీవితాలను చూస్తే వారు ఎన్నో ఆటుపోట్లు అధిగమించారు. అందుకే విజయాలను చూసి ఎక్కువ సంతోషపడకూడదు. ఓటమిని భరించాలి. సినిమా సక్సెస్‌/ఫెయిల్యూర్‌ అందరిది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement