ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు అని చాటిచెప్పేలా ‘నిన్నే చూస్తు’ | Ninne Chusthu Movie Pre Release Event Highlights | Sakshi
Sakshi News home page

ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు అని చాటిచెప్పేలా ‘నిన్నే చూస్తు’

Published Sat, Oct 22 2022 9:12 PM | Last Updated on Sat, Oct 22 2022 9:12 PM

Ninne Chusthu Movie Pre Release Event Highlights - Sakshi

కె. గోవర్ధనరావు దర్శకత్వంలో శ్రీకాంత్ గుర్రం, బుజ్జి (హేమలతా రెడ్డి), హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘నిన్నే చూస్తు’. వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై పోతిరెడ్డి హేమలత రెడ్డి నిర్మించిన చిత్రం అక్టోబర్‌ 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది చిత్రబృందం. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన సీనియర్‌ హీరో సుమన్‌ మాట్లాడుతూ.. ‘నేను చాలా బిజీగా ఉన్నప్పటికీ.. ఈ సినిమా కోసం డేట్స్‌  అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. నటి, నిర్మాత హేమలత రెడ్డి చాలా యంగ్ అండ్ డైనమిక్ లేడీ తను సుహాసిని, భానుచందర్ లాంటి పెద్ద ఆర్టిస్టులను పెట్టుకొని  సినిమాలో నటిస్తూనే నిర్మాతగా సినిమాను చాలా చక్కగా డీల్ చేసింది. ఈ సినిమాలో తన డైలాగ్స్ అన్ని సింగల్ టేక్ లో చేసుకుంటూ అటు నిర్మాతగా ఇటు యాక్టర్ గా చేస్తూ సర్కస్ లో రింగ్ మాస్టర్ లా తనే దగ్గరుండి చూసుకుంటూ షూటింగ్ సక్సెస్ చేసింది’అన్నారు.

ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి చిన్న సినిమాలు ఇండస్ట్రీకి రావడం ఎంతో అవసరం. ఫిల్మ్ చాంబర్ ఎప్పుడూ ఆట్టి దర్శక,నిర్మాతలకు సపోర్ట్ చేస్తుంది. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ‘ఎన్ని సమస్యలున్నా ప్రేమ ఎప్పుడూ ఓడిపోకూడదు అనే ఆలోచనతో పెద్దలకు, ప్రేమికులకు అర్థమయ్యే రీతిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించా’మని హీరోయిన్‌, నిర్మాత పోతిరెడ్డి హేమలత రెడ్డి అన్నారు.  మంచి కంటెంట్ తో వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని దర్శకుడు కె.గోవర్థన్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement