
నేహాదేశ్ పాండే, సంతోష్ రాజ్
సంతోష్ రాజ్, నేహాదేశ్ పాండే జంటగా సుమన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘అనువంశికత’. ‘జెనిటిక్ లవ్ స్టోరీ’ అన్నది ఉపశీర్షిక. రమేష్ ముక్కెర దర్శకత్వంలో తాళ్లపెల్లి దామోదర్ గౌడ్ నిర్మిస్తున్న ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నటుడు సుమన్ మాట్లాడుతూ– ‘‘రక్త సంబంధీకులను పెళ్లి చేసుకుంటే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయనే పాయింట్‌తో ఈ సినిమా తీశారు. మంచి సందేశాత్మకంగా ఉంటుంది. పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు.
‘‘ఈ సినిమా కోసం 45 డిగ్రీల వేడిని సైతం లెక్క చేయకుండా షూటింగ్ చేశాం. నిర్మాత సహకారం వల్లే ఇంత మంచి సినిమా తీశాం’’ అన్నారు రమేష్ ముక్కెర. ‘‘మంచి కథాంశంతో రూపొందిన చిత్రమిది. మా తొలి ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు తాళ్లపెల్లి్ల దామోదర్ గౌడ్. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, సంతోష్ రాజ్, నేహాదేశ్ పాండే, గీత రచయిత తైదల బాపు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: యండి. యాకూబ్, సమర్పణ: అశ్విత, క్రాంతికుమార్, కథ, మాటలు, సంగీతం, దర్శకత్వం: రమేష్ ముక్కెర.
Comments
Please login to add a commentAdd a comment