సుమన్‌ @ 100 | Ayyapaa Kataksham Movie Trailer Launch | Sakshi
Sakshi News home page

సుమన్‌ @ 100

Published Mon, Nov 25 2019 4:09 AM | Last Updated on Mon, Nov 25 2019 4:19 AM

Ayyapaa Kataksham Movie Trailer Launch - Sakshi

సుమన్‌

హీరోగా సెంచరీ కొట్టారు సుమన్‌. రుద్రాభట్ల వేణుగోపాల్‌ దర్శకత్వంలో సుమన్‌ హీరోగా నటించిన చిత్రం ‘వీరశాస్త్రి అయ్యప్ప కటాక్షం’. ఈ చిత్రం హీరోగా సుమన్‌కి 100వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు అందించడంతో పాటు బద్రీష్‌ రామ్‌తో కలసి నిర్మిస్తున్నారు రచయిత, ఆధ్యాత్మికవేత్త వి.ఎస్‌.పి తన్నేటి.

ఈ సినిమా ట్రైలర్‌ విడుదల సందర్భంగా సుమన్‌ మాట్లాడుతూ– ‘‘తెలుగులో హీరోగా 99 సినిమాలు చేశాక ‘అన్నమయ్య’ సినిమాలో వెంకటేశ్వరస్వామి పాత్ర చేసే అవకాశం వచ్చింది. అప్పటి నుంచి క్యారెక్టర్‌ రోల్స్‌ చేస్తున్నాను. ఈ చిత్రం నా 100వ సినిమా కావడం అదృష్టం. నా తొలి చిత్ర దర్శక–నిర్మాతలు రేలంగి నర్సింహారావు, తమ్మారెడ్డి భరద్వాజ సమక్షంలో ఈ ఫంక్షన్‌ జరగడం సంతోషం’’ అన్నారు. ‘‘శంకర్‌ మహదేవన్, యస్పీ బాలసుబ్రహ్మణ్యంగార్ల పాటలు మా సినిమాలో హైలెట్‌’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: వి.ఎస్‌.ఎల్‌. జయకుమార్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement