సాక్షి,ఒంగోలు : తొమ్మిది భాషల్లో నటించినా ‘తెలుగు‘ భాషే సంతృప్తినిచ్చిందని ప్రముఖ సినీనటుడు సుమన్ పేర్కొన్నారు. ఒంగోలులో ఒక కార్యాక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సుమన్ తన సినీ ప్రస్థానంపై ‘సాక్షి’తో ముచ్చటించారు.
తెలుగు పరిశ్రమ అక్కున చేర్చుకుంది
40 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్నా. 9 భాషల్లో నటించా. కానీ తెలుగు చిత్రసీమ ఎక్కువగా నన్ను ఆదరించింది. పాత, కొత్త నిర్మాతలు, దర్శకులతో చేసిన అనుభవం నాది. హీరో, విలన్, ఉప కథానాయకుడిగా అనేక పాత్రలు ఇచ్చి తెలుగు సినీరంగం నన్ను అక్కున చేర్చుకుంది.
సెంచరీకి ‘సినిమా’ దూరంలో..
ఇప్పటికి తొమ్మిది భాషల్లో 99 సినిమాలు చేశా. ఇంకో సినిమా చేస్తే వంద సినిమాలు పూర్తవుతాయి. నా జర్నీ సంతృప్తికరంగానే సాగుతోంది.
రాష్ట్ర విభజనతో నష్టం లేదు
రాష్ట్ర విభజన వల్ల ఏమీ నష్టం జరగలేదు. ఇంకా మంచే జరిగింది. అయితే, విశాఖకు సినీ పరిశ్రమ తరలితే ఇంకా బాగుంటుంది. ఇప్పటికే గోదావరి జిల్లాలు, విశాఖపట్నంలో సినిమా షూటింగ్‌లు బాగానే జరుగుతున్నాయి.
చదవండి : బిగ్‌బాస్ సీజన్–4 వ్యాఖ్యాత ఎవరు?
Comments
Please login to add a commentAdd a comment