‘ఐక్యూ’టీమ్‌తో మరో చిత్రం | KLP Movies Production No 2 Movie Announcement Highlights | Sakshi
Sakshi News home page

‘ఐక్యూ’టీమ్‌తో మరో చిత్రం

Published Thu, Dec 15 2022 6:57 PM | Last Updated on Thu, Dec 15 2022 6:57 PM

KLP Movies Production No 2 Movie Announcement Highlights - Sakshi

కాయగూరల లక్ష్మీపతి నిర్మాతగా కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కెఎల్పి మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం2 చిత్రం అనౌన్స్‌మెంట్‌ నేడు ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగింది. ఈ చిత్రానికి జిఎల్బి శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. వరికుప్పల యాదగిరి సంగీతాన్ని అందించారు. పోలూరి ఘటికాచలం కథ మాటలు అందించారు. ఈ బ్యానర్‌లో ఐక్యూ మొదటి చిత్రం పూర్తయి ఫస్ట్ కాపీ రావడంతో పాత్రికేయుల సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొని చిత్ర విశేషాలను పంచుకున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాత కాయగూరల లక్ష్మీపతి మాట్లాడుతూ... ‘ఐక్యూ’ చిత్రంలో ఉన్నవారినే ఈ చిత్రంలో తీసుకున్నాం. మెడికల్ కాన్సెప్ట్  మీద వస్తున్న చిత్రమిది.  ‘ఐక్యూ’లాగే ఈ చిత్రాన్ని కూడా ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా భారీ స్థాయిలో నిర్మిస్తున్నాం.  ఈ నెల 19న ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుంది’ అన్నారు.  ‘ఐక్యూ’ చిత్రం మొదటి కాపీ రావడం.. ఆదే బ్యానర్‌లో ప్రొడక్షన్‌ నెం.2 కూడా అనౌన్స్‌మెంట్‌ చేయడం ఆనందంగా ఉంది’అని దర్శకుడు జీఎల్బీ శ్రీనివాస్‌ అన్నారు. 

ఈ చిత్రంలో నేను పోలీసు అధికారి పాత్ర పోషించాను. సినిమాను చాలా ఫాస్ట్‌గా పూర్తి చేశారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’అని హీరో సుమన్‌ అన్నారు.  సుమన్‌తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను అని హీరో భూషన్‌ అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ అంకిత, బాబా, ల్లవి, పద్మిని, ప్రమోదిని, ట్రాన్సీ, పొట్టిమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement