Bhushan
-
టీడీపీ కుట్ర బట్టబయలు.. షర్మిలపై అసభ్యకర పోస్టులు..
కడప అర్బన్: అసభ్య దూషణలతో ఫేక్ పోస్టులు పెడుతూ దీన్ని వైఎస్సార్ సోషల్ మీడియాకు ఆపాదించేందుకు యత్నించిన టీడీపీ కుట్రలు బహిర్గతమయ్యాయి. విశాఖకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, టీడీపీ సానుభూతిపరుడైన పినపాల ఉదయ్ భూషణ్ ఫేస్బుక్లో జుగుప్సాకరంగా వైఎస్ షర్మిల, నర్రెడ్డి సునీతపై పోస్టింగ్‌లు పెడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. బుధవారం కడపలో అదనపు ఎస్పీ (అడ్మిన్) లోసారి సుధాకర్ మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. సాక్ష్యాధారాలతో దొరికిపోయినప్పటికీ తన భర్తను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారంటూ నిందితుడు ఉదయ్ భార్య ఏకంగా విశాఖలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి ఆరోపణలు చేయడం ఆ పార్టీతో వారి అనుబంధాన్ని రుజువు చేస్తోంది. ఒకవైపు షర్మిలతో తాను రూపొందించిన స్క్రిప్టు చదివిస్తూ కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయిస్తున్న చంద్రబాబు మరోవైపు తన శిష్య గణం ద్వారా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ పోస్టింగ్‌లకు పురిగొల్పుతున్నట్లు స్పష్టమవుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఎవరినైనా సరే తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని అవసరం తీరాక బురద చల్లడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని వ్యాఖ్యానిస్తున్నారు. ఫేక్ అకౌంట్ సృష్టించి.. విశాఖపట్నంలోని మహారాణిపేట సామ్రాట్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న నిందితుడు పినపాల ఉదయ్ ఈ ఏడాది జనవరి 13వతేదీన పులివెందులకు చెందిన వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్ సృష్టించాడు. వైఎస్ఆర్ సోషల్ మీడియా సభ్యుడైన రవీంద్రారెడ్డి ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టి సదరు ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ నుంచి షర్మిల, సునీతపై అసభ్యకర పదజాలంతో పోస్టులు పెడుతున్నాడు. తన పేరు, ఫోటోను వినియోగించి దుష్ప్రచారానికి పాల్పడటంపై రవీంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో ఈనెల 3న క్రైం.నెం. 45/2024 కేసు నమోదైంది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ అదనపు ఎస్పీ (అడ్మిన్) లోసారి సుధాకర్ పర్యవేక్షణలో పులివెందుల డీఎస్పీ కేఎస్ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో సీఐ సి.శంకర్‌రెడ్డి, సైబర్ క్రైం సీఐలు శ్రీధర్‌నాయుడు, మధుమల్లేశ్వర్రెడ్డిలను రెండు బృందాలుగా విభజించి దర్యాప్తు ప్రారంభించారు. ఫేస్బుక్ డేటా బేస్ ఆధారంగా నిందితుడు ఉపయోగించిన ఐపీ అడ్రస్‌ను ట్రాక్ చేసి విశాఖకు చెందిన పినపాల ఉదయ్ భూషణ్‌గా గుర్తించారు. టీడీపీకి వీరాభిమాని అయిన నిందితుడు పార్టీ తరఫున పలు వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా గ్రూపుల్లో అసభ్యకరమైన మెస్సేజ్‌లు, పోస్టులు పెడుతున్నట్లు నిర్ధారించారు. సైబర్ క్రైమ్ పోలీసులు అత్యాధునిక టెక్నాలజీ ద్వారా నిందితుడు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి అతడి నివాసం వద్ద ఈనెల 13న అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన యాపిల్ ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన పులివెందుల డీఎస్పీ వినోద్‌కుమార్, అర్బన్ సీఐ శంకర్‌రెడ్డి, సైబర్ క్రైం సీఐలు శ్రీధర్‌నాయుడు, మధుమల్లేశ్వర్‌రెడ్డి, ఎస్ఐ జీవన్‌రెడ్డి, పులివెందుల ఎస్ఐ అరుణ్‌రెడ్డి తదితర సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ వ్యవహారంలో ఇతర కుట్రదారులెవరన్నది తేల్చేందుకు క్షుణ్నంగా దర్యాప్తు చేపట్టారు. -
ఘనంగా బతుకమ్మ వేడుకలు!
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగ రోజున 'గౌరమ్మను' పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పండుగను అంగరంగా వైభవంగా జరుపుతారు. ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. పార్వతి గురించి పాటలాగా పాడుతూ.. ఆనందంతో బతుకమ్మను జరుపుకుంటారు. ఆడపడచులు, యువకులు, పిల్లలు, పెద్దలు తమ ఆనందాన్ని చూపే కన్నుల పండుగగా.. తెలంగాణ ప్రజలకు ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ ఈ బతుకమ్మ. ఈ సందర్భంగా పల్లెలు, పట్టణాల్లో ఆలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో పల్లెలు, పట్టణాలు తీరొక్క పూల శోభ సంతరించుకోనుంది. ఈ క్రమంలో చెరువుల వద్ద నిమజ్జన ప్రదేశాల్లో రంగుల ఆహ్లాదం ఎంతో చూడముచ్చట. పౌష్టికాహారం, చిరుధాన్యాలు, కూరగాయలు, గాజులు, చేతివృత్తులతో తయారు చేసిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణీయం. బతుకమ్మ పండుగ కేవలం కటుంబాలకు, ఇంటికే పరిమితం కాదు, తెలంగాణలోని అన్నీ రంగాలవారిగా.. విద్యా, వైద్యా, సాంకేతిక, వివిధ పరిశ్రమల్లో బతుకమ్మ వేడుకల నిర్వహణ ఎంతో కన్నుల పండుగగా చెప్పవచ్చు అనడానికి నిదర్శనంగా.. 'డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ కార్యాలయంలో' శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. 'డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగం' డైరెక్టర్ వి ఫణిభూషణ్‌శర్మ ఈ వేడుకలకు హాజరయ్యారు. 'జాయింట్ డైరెక్టర్లు' హెచ్ శైలజారాణి, పి రజిని, తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. రంగారెడ్డి హైదరాబాద్ 'పే అండ్ అకౌంట్ ఆఫిసర్స్' మహ్మద్ ఆరిఫ్, ఆర్ వి రామగోపాల్ అండ్ స్టాఫ్, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగ సిబ్బంది, తదితరులు బతుకమ్మ వేడుకల సందర్భంగా హాజరయ్యారు. బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళల్ని మరింత ప్రోత్సహించే దిశలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఇలాంటి మరెన్నో పండుగలు జరుపుకోవాలని డైరెక్టర్ కోరుతూ.. అందుకు అందరి ప్రోత్సాహం ఎంతో అవసరమని తెలిపారు. -
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిపై లైంగిక ఆరోపణలు
-
‘ఐక్యూ’టీమ్‌తో మరో చిత్రం
కాయగూరల లక్ష్మీపతి నిర్మాతగా కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కెఎల్పి మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం2 చిత్రం అనౌన్స్మెంట్ నేడు ఫిల్మ్ ఛాంబర్లో జరిగింది. ఈ చిత్రానికి జిఎల్బి శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. వరికుప్పల యాదగిరి సంగీతాన్ని అందించారు. పోలూరి ఘటికాచలం కథ మాటలు అందించారు. ఈ బ్యానర్లో ఐక్యూ మొదటి చిత్రం పూర్తయి ఫస్ట్ కాపీ రావడంతో పాత్రికేయుల సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొని చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కాయగూరల లక్ష్మీపతి మాట్లాడుతూ... ‘ఐక్యూ’ చిత్రంలో ఉన్నవారినే ఈ చిత్రంలో తీసుకున్నాం. మెడికల్ కాన్సెప్ట్ మీద వస్తున్న చిత్రమిది. ‘ఐక్యూ’లాగే ఈ చిత్రాన్ని కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో నిర్మిస్తున్నాం. ఈ నెల 19న ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుంది’ అన్నారు. ‘ఐక్యూ’ చిత్రం మొదటి కాపీ రావడం.. ఆదే బ్యానర్లో ప్రొడక్షన్ నెం.2 కూడా అనౌన్స్మెంట్ చేయడం ఆనందంగా ఉంది’అని దర్శకుడు జీఎల్బీ శ్రీనివాస్ అన్నారు. ఈ చిత్రంలో నేను పోలీసు అధికారి పాత్ర పోషించాను. సినిమాను చాలా ఫాస్ట్‌గా పూర్తి చేశారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’అని హీరో సుమన్ అన్నారు. సుమన్‌తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను అని హీరో భూషన్ అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ అంకిత, బాబా, ల్లవి, పద్మిని, ప్రమోదిని, ట్రాన్సీ, పొట్టిమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడికెళ్లినా.. భారత్ నాలో భాగమే : సుందర్ పిచాయ్
-
‘ఆయుష్మాన్ భారత్’ చీఫ్‌గా ఇందు భూషణ్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జాతీయ ఆరోగ్య భద్రతా పథకం ‘ఆయుష్మాన్ భారత్’కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఇందు భూషణ్ నియమితులయ్యారు. ఆయుష్మాన్ భారత్‌కు భూషణ్ రెండేళ్లపాటు సీఈవోగా కొనసాగుతారని మంగళవారం కేంద్రం ఓ ఉత్తర్వులో పేర్కొంది. ప్రస్తుతం ఈయన ఫిలిప్పీన్స్‌లోని మనీలా కేంద్రంగా పనిచేస్తున్న ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) తూర్పు ఆసియా విభాగం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భూషణ్ అమెరికాలో హెల్త్ సైన్సెస్‌లో మాస్టర్స్, ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ చేశారు. ‘ఆయుష్మాన్ భారత్’ పథకంలో భాగంగా దేశంలోని ప్రతీ పేద కుటుంబానికి ఏటా ప్రభుత్వం రూ.5 లక్షల మేర ఉచిత బీమా సౌకర్యం కల్పించనుంది. -
నన్నయ వీసీకి విద్యాభూషణ్ అవార్డు ప్రదానం
రాజరాజనరేంద్రనగర్ (రాజాన గరం): ప్రపంచ ఉపాధ్యాయదినోత్సవం సందర్భంగా ‘మేజిక్ ఫర్ సోషల్ సర్వీస్’ స్వచ్ఛంద సంస్థ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సేవలందించిన విశిష్ట వ్యక్తులకు ఏటా ఇస్తున్న విద్యాభూషణ్ అవార్డును ఈ ఏడాది నన్నయ వర్సిటీ వీసీ ఆచార్య ముత్యాలు నాయుడికి అందజేసింరు. ఈ సందర్భంగా ఆయనను బుధవారం యూనివర్సిటీలో ఆ సంస్థ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ అవార్డును సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ చింతా శ్యామ్, జ్యూరీ సభ్యులు ఆయనకు అందజేశారు. వీసీ ముత్యాలునాయుడు కృతజ్ఞతలు తెలిపారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎ. నరసింహారావు, అధ్యాపకులు డాక్టర్ టి. సత్యనారాయణ, డాక్టర్ ఎస్. టేకి తదతరులు పాల్గొన్నారు. -
పీతల సుజాత తండ్రిని కూడా విచారించాం: ఎస్పీ
-
మిథాలీ, సింధు ‘పద్మశ్రీ’లు
రెజ్లింగ్ కోచ్ సత్పాల్ సింగ్‌కు పద్మభూషణ్ న్యూఢిల్లీ: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ యువ క్రీడాకారిణి పీవీ సింధు ప్రతిష్టాత్మక పౌర పురస్కారం ‘పద్మశ్రీ’కి ఎంపికయ్యారు. ఆదివారం ప్రకటించిన ఈ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వీరిద్దరికి ఈ గౌరవం దక్కింది. దాదాపు పదిహేనేళ్ల అంతర్జాతీయ కెరీర్లో 32 ఏళ్ల మిథాలీ 10 టెస్టులు, 153 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. సుదీర్ఘ కాలంగా జట్టు కెప్టెన్‌గా కూడా కొనసాగుతున్న ఈ క్రికెటర్, గతేడాది ఇంగ్లండ్ గడ్డపై భారత్‌కు చరిత్రాత్మక సిరీస్ విజయాన్ని అందించింది. 20 ఏళ్ల సింధు వరుసగా రెండేళ్ల పాటు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్యాలు గెలిచి సంచలనం సృష్టించింది. 2014 ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్ క్రీడల్లో కూడా ఆమె పతకాలు సాధించింది. ధోని, కోహ్లిలకు దక్కలేదు... భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్, హాకీ క్రీడాకారిణి సబా అంజుమ్ కరీమ్, వికలాంగ క్రీడాకారిణి అరుణిమ సిన్హాలకు కూడా ‘పద్మశ్రీ’ దక్కింది. అయితే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోని, విరాట్ కోహ్లిలకు మాత్రం నిరాశే ఎదురైంది. పద్మభూషణ్‌కు ధోని పేరును, పద్మశ్రీకి కోహ్లి పేరును బీసీసీఐ ప్రతిపాదించింది. సుశీల్‌కూ లేదు... వివాదం సృష్టించిన పద్మభూషణ్ అవార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సుశీల్ కుమార్, సైనా నెహ్వాల్ ఇద్దరినీ పక్కన పెట్టింది. సుశీల్ పేరును ప్రతిపాదించడంపై నిబంధనలు చూపిస్తూ సైనా అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వీరిని కాదని మాజీ రెజ్లర్ సుశీల్ కోచ్, మామ కూడా అయిన సత్పాల్ సింగ్‌ను పద్మభూషణ్‌కు ఎంపిక చేసింది. 59 ఏళ్ల సత్పాల్ 1974, 1982 ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచారు. ఆయనకు 1983లోనే పద్మశ్రీ, 2009 ద్రోణాచార్య అవార్డులు దక్కాయి. కోచ్‌గా సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ సహా పలువురు అగ్రశ్రేణి రెజ్లర్లను తీర్చి దిద్దిన ఘనత సత్పాల్ సొంతం. ఊహించలేదు... చాలా సంతోషంగా ఉంది. నామినేషన్లలో ఉన్నా నేను అవార్డుకు ఎంపికవుతానని అస్సలు ఊహించలేదు. ఇంత చిన్న వయసులోనే పద్మశ్రీలాంటి పురస్కారం దక్కడం పట్ల గర్వ పడుతున్నా. భవిష్యత్తులో మరింత బాగా ఆడేందుకు ఇది స్ఫూర్తినిస్తుంది. -‘సాక్షి’తో పీవీ సింధు -
వైఎస్ఆర్ సిపి నేత భూషణ్‌తో సాక్షి వేదిక