నన్నయ వీసీకి విద్యాభూషణ్ అవార్డు ప్రదానం
నన్నయ వీసీకి విద్యాభూషణ్ అవార్డు ప్రదానం
Published Wed, Oct 5 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
రాజరాజనరేంద్రనగర్ (రాజాన గరం): ప్రపంచ ఉపాధ్యాయదినోత్సవం సందర్భంగా ‘మేజిక్ ఫర్ సోషల్ సర్వీస్’ స్వచ్ఛంద సంస్థ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సేవలందించిన విశిష్ట వ్యక్తులకు ఏటా ఇస్తున్న విద్యాభూషణ్ అవార్డును ఈ ఏడాది నన్నయ వర్సిటీ వీసీ ఆచార్య ముత్యాలు నాయుడికి అందజేసింరు. ఈ సందర్భంగా ఆయనను బుధవారం యూనివర్సిటీలో ఆ సంస్థ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ అవార్డును సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ చింతా శ్యామ్, జ్యూరీ సభ్యులు ఆయనకు అందజేశారు. వీసీ ముత్యాలునాయుడు కృతజ్ఞతలు తెలిపారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎ. నరసింహారావు, అధ్యాపకులు డాక్టర్ టి. సత్యనారాయణ, డాక్టర్ ఎస్. టేకి తదతరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement