ప్రతిభలో సెంచరీ చేద్దాం
ప్రతిభలో సెంచరీ చేద్దాం
Published Wed, Nov 2 2016 11:02 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : పరీక్షలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం అందజేస్తున్న ప్రతిభా అవార్డులను గత విద్యా సంవత్సరంలో తమ యూనివర్సిటీ పరిధిలో 61 మంది సాధించారని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం. ముత్యాలునాయుడు అన్నారు. ఈ సంఖ్యను ఈ విద్యా సంవత్సరంలో వందకు పెంచేందుకు కృషి చేయాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ప్రతిభా అవార్డులు సాధించిన ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 61 మంది విద్యార్థులకు యూనివర్సిటీలో బుధవారం నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ధ్రువీకరణ పత్రంతోపాటు గోల్డ్ మెడల్, ట్యాబ్, రూ. 20 వేల నగదు (చెక్కు రూపంలో) అందజేశారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎ. నరసింహరావు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేష్‌వర్మ, డాక్టర్ ఎస్. టేకి, డాక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement