సీనియర్‌ హీరో సుమన్‌పై చిరు ప్రశంసలు, వీడియో సందేశం ఇచ్చిన మెగాస్టార్‌ | Chiranjeevi Wishes Senior Hero Suman For Completing 45 Years in Film Industry | Sakshi
Sakshi News home page

Chiranjeevi: అది గొప్ప విజయం.. నటుడు సుమన్‌పై చిరంజీవి ప్రశంసలు

Published Wed, Feb 15 2023 9:20 PM | Last Updated on Wed, Feb 15 2023 9:29 PM

Chiranjeevi Wishes Senior Hero Suman For Completing 45 Years in Film Industry - Sakshi

ఓ వైపు యాక్షన్‌ హీరోగా దూసుకుపోతూనే కుటుంబ కథాచిత్రాల్లో నటించారు హీరో సుమన్‌. 1959, ఆగస్టు 28న చెన్నైలో జన్మించిన సుమన్‌ కోలీవుడ్ లో నీచల్ కులం సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. ‘తరంగిణి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై అతి తక్కువ కాలంలోనే తెలుగు, కన్నడ భాషల్లో స్టార్‌ హీరో ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.మార్షల్ ఆర్ట్స్ హీరోగా సుమన్ చేసిన యాక్షన్ సినిమాలకు మంచి గుర్తింపు లభించింది. అంతేకాకుండా టాలీవుడ్‌ అందగాడిగా సుమన్‌కు లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా బాగానే ఉండేది. క సుమన్‌ కెరీర్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భక్తి సినిమాల గురించి.

చదవండి: ఆ హీరోయిన్‌ అంటే క్రష్‌.. తను నన్ను బాగా ఆకట్టుకుంది: రామ్‌ చరణ్‌

ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన సినిమాల్లో అన్నమయ్య ఒకటి. సినిమాలో వెంకటేశ్వరస్వామిగా కనిపించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు సుమన్. ఇదిలా ఉంటే సుమన్‌ ఇండస్ట్రీకి వచ్చి 45 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి స్వయంగా ఆయనకు విషెస్‌ తెలిపారు. ఈ మేరకు సుమన్‌ను కొనియాడుతూ ఆయన వీడియో సందేశం ఇచ్చారు. ‘మై డియర్‌ బ్రదర్‌ సుమన్‌.. నటుడిగా మీరు 45 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. 10 భాషలలో 150కి పైగా సినిమాలు చేయడం అద్భుతమైన విషయం. అది నిజంగా గొప్ప విజయం. సినిమాల పట్ల మీకున్న ఇష్టం, కమిట్‌మెంట్‌కు ఈ 45 ఏళ్లలో మీరు చేసిన చిత్రాలే చెబుతాయి.

చదవండి: శ్రీసత్యకు ప్రపోజ్‌ చేసిన మెహబూబ్‌, చేయి కోసుకుంటానంటూ బ్లాక్‌మెయిల్‌!

ఇంకా మరిన్ని సంవత్సరాలు లక్షలాది అభిమానులు, ప్రేక్షకులను ఇలానే అలరిస్తారని ఆశిస్తున్నా. ఫిబ్రవరి 16న మంగళూరులో మీ 45 ఏళ్ళ కెరీర్ ని పురస్కరించుకొని ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని విన్నాను. ఈ వేడుక విజయవంతం కావాలని కోరుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా సుమన్‌ ‘నీచల్‌ కులమ్‌’ (తమిళ్‌) సినిమాతో తెరంగేట్రం చేశారు. ‘ఇద్దరు కిలాడీలు’తో తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘నేటి భారతం’, ‘సితార’, ‘బావ బావమరిది’ తదితర విభిన్న కథా చిత్రాలతో 90ల్లో అగ్ర హీరోగా రాణించారు. కథానాయకుడిగా కొనసాగుతూనే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు సుమన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement