
ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ, శోభన, అన్నా బెన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. గత కొన్ని నెలలుగా టాలీవుడ్‌లో పెద్ద సినిమాలు రాలేదు. సంక్రాంతి తర్వాత అలాంటి జోష్ మళ్లీ కల్కితో మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా టికెట్ల అమ్మకాలు కూడా ప్రారంభం అయ్యాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నాగ్ అశ్విన్ తెరెక్కించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ విడుదల చేస్తోంది.
హైదరాబాద్‌లో సింగిల్ థియేటర్ నుంచి మల్టీఫ్లెక్స్‌ల వరకు ప్రతిచోట కల్కి చిత్రాన్నే ప్రదర్శిస్తున్నారు. హైదరబాద్ జోన్ పరిధిలో 1వ రోజు అడ్వాన్స్ బుకింగ్ విషయంలో కల్కి రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రోజు రూ. 6 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ మొత్తం రిలీజ్ సమాయానికి పెరగవచ్చని కూడా సమాచారం.
జూన్ 27న హైదరాబాద్‌లో తెల్లవారుజామున 4:30 గంటలకే మొదటి షో పడుతుంది. కల్కి టికెట్ల ధరలను వారం రోజుల పాటు పెంచుకునే వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. టికెట్‌పై గరిష్ఠంగా రూ.200 పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు రోజుకు ఐదు షోలు నిర్వహించుకోవచ్చని తెలపడంతో మొదటిరోజు ఓపెనింగ్స్ భారీగానే జరిగినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment