'కల్కి' మిడ్ నైట్ షోలు వేయకపోవడానికి కారణం అదేనా? | Here Reason Behind Not Allowed Kalki 2898 AD Mid-Night Show | Sakshi
Sakshi News home page

Kalki 2898 AD: అరరాత్రి షోలు అందుకే వేయట్లేదా?

Published Tue, Jun 25 2024 9:23 PM | Last Updated on Tue, Jun 25 2024 9:27 PM

Reason Behind Not Allowed Kalki 2898 AD Mid Night Show

ప్రస్తుతం సోషల్ మీడియాలో 'కల్కి' తప్ప మరో మాట వినిపించడం లేదు. సినిమా గురించి లేదా టికెట్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్‌లో పెట్టిన షోలు పెట్టినట్లు ఫుల్ అయిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయిపోతున్నాయి. అంతా బాగానే ఉంది కానీ మిడ్ నైట్ బెన్‌ఫిట్ ఎందుకు వేయట్లేదా అని చాలామంది అనుకుంటున్నారు.

(ఇదీ చదవండి: 'కల్కి' థీమ్ సాంగ్ రిలీజ్.. మొత్తం స్టోరీ ఒకే పాటలో!)

అయితే ఈ విషయంలో మూవీ టీమ్ చాలా ముందుచూపుతో ఆలోచించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అర్థరాత్రి అంటే కొందరైనా సరే మద్యం సేవించి వచ్చిన వాళ్లు ఉంటారు. వీళ్ల వల్ల గొడవలయ్యే అవకాశముంటుంది. మరోవైపు రాత్రి అంటే నిద్రలేకుండా సినిమా చూడాల్సి వస్తుంది. దీంతో అద్భుతమైన సీన్స్ కూడా సరిగా అర్థం కాకపోవచ్చు.

అదే ఉదయం అయితే ఫ్రెష్‌ మైండ్‌తో థియేటర్‌కి వస్తారు. అలానే నైట్ షోలతో పోలిస్తే ఉదయం అయితే టాక్ జెన్యూన్ రావొచ్చు. బహుశా ఈ కారణాల వల్లనో ఏమో 'కల్కి' టీమ్ మిడ్‌నైట్ బెన్‌ఫిట్ షోలకు నో చెప్పేసి ఉంటారు. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది? ఏంటనేది మరో 36 గంటల్లో తెలిసిపోతుందిలే!

(ఇదీ చదవండి: స్టార్ హీరో విడాకుల రూమర్స్.. హింట్ ఇచ్చిన భార్య?)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement