యంగ్ రెబల్ స్టార్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్‌లో డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ తేదీని ప్రకటించారు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో అమితాబ్, ప్రభాస్, దీపికా పదుకొణె నిలబడి ఉండగా.. ఎడారి లాంటి ప్రాంతంలో ఉన్న ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.
అయితే తాజా పోస్టర్ చూసిన నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. అచ్చం హాలీవుడ్ మూవీ డూన్‌ను పోలి ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ సినిమా నుంచే కాపీ కొట్టారా? సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా పోస్టర్‌పై వస్తున్న విమర్శలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. అలాంటిదేం లేదంటూ ఆయన కొట్టిపారేశారు. ఈ పోస్టర్‌లో ఇసుక కనిపిస్తున్న కారణంగా అలా పోల్చడం సరైంది కాదని అన్నారు. కేవలం ఇసుక ఉండటం వల్ల సినిమాలు ఒకే విధంగా ఉన్నాయని ప్రేక్షకులు భావించొద్దని ఆయన సూచించారు.
కాగా.. కల్కి 2898 ఏడీ మహాభారతంతో ముడిపడి ఉంటుందని గతంలోనే నాగ్ అశ్విన్ వెల్లడించారు. ఈ సినిమా మహాభారతంలో మొదలై 2898 ఏడీలో ముగుస్తుందని తెలిపారు. గతంలోనూ కాన్సెప్ట్, మేకింగ్, క్రాప్ట్ , విజువలైజేషన్ సైతం హాలీవుడ్ సినిమాలను పోలి ఉన్నాయంటూ విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కమల్ హాసన్, దిశా పటాని కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది జూన్ 27న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనుంది.
All the forces come together for a better tomorrow on 𝟐𝟕-𝟎𝟔-𝟐𝟎𝟐𝟒.#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #Kalki2898ADonJune27 pic.twitter.com/kItIJXvbto
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 27, 2024
Comments
Please login to add a commentAdd a comment