'కల్కి' టికెట్ల ధరలు భారీగా పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి | AP Government has approved higher ticket prices and extra shows for the movie Kalki 2898 AD featuring Prabhas. | Sakshi
Sakshi News home page

'కల్కి' టికెట్ల ధరలు భారీగా పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి

Jun 25 2024 6:43 AM | Updated on Jun 25 2024 9:38 AM

Kalki 2898 AD Tickets Price Hiked In Andhra Pradesh

ప్రభాస్‌ హీరోగా నటించిన సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ ఫ్యూచరిస్టిక్‌ ఫిల్మ్‌ ‘కల్కి 2898ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ,శోభన ప్రముఖ పాత్రలలో నటించారు. భారీ బడ్జెట్‌తో  నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సి. అశ్వినీదత్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టికెట్‌ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

కల్కి టికెట్ల విక్రయాలు ఆన్‌లైన్‌ ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో  'కల్కి 2898 ఏడీ' సినిమా టికెట్‌ ధరల పెంపు, అదనపు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండు వారాలపాటు ఈ వెసులుబాటును ఏపీ కల్పించింది. కల్కి సినిమా కోసం టికెట్‌ ధరల పెంపుతో పాటు అదనపు షోలకు అనుమతి ఇవ్వాలని చిత్ర నిర్మాత అశ్వినీదత్‌ కోరడంతో ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. 

ఈ క్రమంలో టికెట్‌పై సింగిల్‌ స్క్రీన్‌ సాధారణ థియేటర్‌లో అయితే రూ.75,  మల్టీప్లెక్స్‌లలో అయితే రూ.125 వరకు పెంచుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా రోజుకు ఐదు షోలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే గత ఐదేళ్లలో ఏ సినిమాకు ఇంతలా టికెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది లేదు. అయితే కల్కి నిర్మాత అశ్వనీదత్‌ అధికార టీడీపీకి దగ్గరి వ్యక్తి కావడంతోనే ఈ వెసులుబాటు ఇచ్చారేమో అనే చర్చ నడుస్తోంది ఇప్పుడు. కల్కి సినిమాకు చేసిన తాజా పెంపుతో.. ఏపీలో రెండు వారాల పాటు టికెట్ల ధరలు గతం కంటే ఎక్కువే ఉండబోతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement