ప్రభాస్‌ కల్కి 2898 ఏడీ.. రిలీజ్‌కు ముందు బిగ్ అప్‌డేట్‌! Prabhas and Nag Ashwin Kalki 2898 AD Update Goes Viral. Sakshi
Sakshi News home page

Kalki 2898 AD: ప్రభాస్‌ కల్కి 2898 ఏడీ.. రిలీజ్‌కు ముందు బిగ్ అప్‌డేట్‌!

Published Thu, Jun 20 2024 9:45 PM | Last Updated on Fri, Jun 21 2024 9:15 AM

Prabhas and Nag Ashwin Kalki 2898 AD Update Goes Viral

యంగ్ రెబల్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ మోస్ట్‌ అవైటేడ్‌ ఫిల్మ్ 'కల్కి 2898 ఏడీ'. సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌గా నాగ్ అశ్విన్‌ డైరెక్షన్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతే కాకుండా అమితాబ్‌, కమల్‌ హాసన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌, ట్రైలర్‌ విపరీతమైన రెస్పాన్స్‌ వస్తోంది. రిలీజ్‌ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇటీవలే ముంబయిలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు.

తాజాగా కల్కి మేకర్స్ నుంచి బిగ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది. విడుదలకు మరో వారం రోజులు ఉండగానే ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. కల్కి రిలీజ్ ట్రైలర్‌ శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వైజయంతి మూవీస్‌ ట్విటర్‌ ద్వారా పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ చిత్రం బుజ్జి అనే కారు హైలెట్‌గా నిలవనుంది. ఇప్పటికే బుజ్జి లుక్‌ను రివీల్‌ చేశారు. త్వరలోనే ఈ సినిమాకు బుకింగ్స్ కూడా ప్రారంభం కానున్నాయి. మరోవైపు విదేశాల్లో కల్కి టికెట్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. అమెరికాతో పాటు యూకేలో బుకింగ్స్‌ విషయంలో విశేష ఆదరణ లభిస్తున్నట్లు చిత్ర బృందం చెబుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement