'కల్కి' ట్రైలర్‌ రిలీజ్‌కి డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే? | Prabhas Kalki 2898 AD Trailer Telugu Release Date Locked | Sakshi
Sakshi News home page

Kalki 2898 Trailer: 'కల్కి' ట్రైలర్ వచ్చేది ఆ రోజే.. ఈసారి ఏం చేస్తారో?

Published Wed, Jun 5 2024 10:26 AM | Last Updated on Wed, Jun 5 2024 11:59 AM

Prabhas Kalki 2898 AD Trailer Telugu Release Date Locked

డార్లింగ్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి'. వేసవిలోనే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. టెక్నికల్ కారణాలతో వాయిదా పడింది. జూన్ 27న వస్తామని ఇదివరకే ప్రకటించారు. రీసెంట్‌గానే బుజ్జి పేరుతో ఓ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఎన్నికల హడావుడి వల్ల ప్రమోషన్స్‌కి చిన్న బ్రేక్ ఇచ్చారు. కానీ ఇప్పుడు మళ్లీ షురూ చేశారు. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది క్లారిటీ ఇచ్చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన హిట్ స్పోర్ట్స్ బయోపిక్ మూవీ.. ఫ్రీగా స్ట్రీమింగ్)

'సలార్'తో గతేడాది వచ్చిన ప్రభాస్.. హిట్ కొట్టాడు. ఇప్పుడు 'కల్కి'గా రాబోతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మూవీపై జనాలకు అంచనాలు బాగానే ఉన్నాయి. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ చేయాల్సి ఉంది. సినిమాలో ప్రభాస్ ఉపయోగించే కారు పేరు బుజ్జి. దీన్ని లాంచ్ చేస్తూ కొన్నిరోజుల ముందు హైదరాబాద్‌లో ఈవెంట్ పెట్టారు. బుజ్జి టీజర్ రిలీజ్ చేయగా, అది కాస్త అంచనాల్ని పెంచింది.

అయితే 'కల్కి' ట్రైలర్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు జూన్ 10న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే దీన్ని కూడా ముంబయిలో ఈవెంట్ పెట్టి, విడుదల చేస్తారని తెలుస్తోంది. దాదాపు రూ.500 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'కల్కి'లో ప్రభాస్‪‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

(ఇదీ చదవండి: తెలుగు ఇండస్ట్రీపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. హీరోయిన్లకు పెళ్లయితే)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement