ప్రభాస్‌ 'కల్కి' ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి | SS Rajamouli To Take Part In Kalki 2898 AD Movie - Sakshi
Sakshi News home page

Kalki 2898 AD: కల్కి ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి .. హాలీవుడ్‌ రేంజ్‌లో ప్లాన్‌

Published Wed, Aug 30 2023 8:32 AM | Last Updated on Wed, Aug 30 2023 9:26 AM

Ss Rajamouli Part In Kalki Project - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌  హరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ 'కల్కి 2898' షూటింగ్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో  ప్రభాస్‌కు జంటగా దీపిక పదుకొణె నటిస్తుండగా విలన్‌ పాత్రలో కమల్‌హాసన్‌ కనిపించనున్నారు. ఒక కీలక పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ  'కల్కి' గ్లింప్స్‌ను మేకర్స్‌ గ్రాండ్‌గా విడుదల చేశారు. అందుకు రెస్పాన్స్‌ కూడా అదిరిపోయే రేంజ్‌లో వచ్చింది. హాలీవుడ్‌ రేంజ్‌లో విజువల్స్‌ ఉన్నాయని చాలామంది కామెంట్లు కూడా చేశారు.

(ఇదీ చదవండి: డ్రగ్స్‌ కేసుపై వరలక్ష్మీ శరత్‌కుమార్ వివరణ​.. ఆదిలింగం ఎవరంటే?)

ఈ గ్లింప్స్‌పై రాజమౌళి కూడా 'కల్కి' టీమ్‌పై ప్రశంసలు కురిపించారు. గ్రేట్‌ జాబ్‌ అంటూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ని ఆయన కొనియాడారు. ఇలాంటి సినిమాలు తీయడం పెద్ద టాస్క్‌. అయినా మీరు సాధించగలిగారని ఆయన చెప్పుకొచ్చారు. తాజాగ ఈ సినిమాపై సెన్సేషనల్ విషయం ఒకటి వైరల్‌ అవుతుంది.  ఈ సినిమాలోకి దిగ్గజ దర్శకుడు రాజమౌళి అడుగుపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కమల్‌హాసన్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు అశ్వినిదత్‌ కూడా  ఈ మధ్యే చెప్పాడు. దీంతో​ రాజమౌళి కూడా  ఇప్పటికే కల్కి ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యాడని సమాచారం.  

డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేరిన జక్కన్న నాగ్‌ అశ్విన్‌కు తోడుగా షూటింగ్ కూడా స్టార్ట్‌ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ విషయం సోషల్‌మీడియాలో ప్రచారం అవుతుండటంతో ఈ సినిమా హాలీవుడ్‌ రేంజ్‌కు వెళ్లడం ఖాయం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం అలాంటిదేమి లేదు జక్కన్న కల్కీ ప్రాజెక్ట్‌లో ఉన్నాడు కానీ డైరెక్షన్‌ టీమ్‌లో కాదు అంటున్నారు. కల్కీ సినిమాలో ఆయన కామియో రోల్‌ పోసిస్తున్నట్లు మరికొందరు తెలుపుతున్నారు.

(ఇదీ చదవండి: మోసం చేశారు.. అలా నన్నుచూసి మా అమ్మ ఏడ్చింది: టాప్‌ హీరోయిన్‌)

అంటే 'జైలర్‌' సినిమాలో శివరాజ్‌ కుమార్‌,మోహన్‌లాల్‌ లాంటి పాత్రలలో ఆయన కనిపించనున్నారని కూడా టాక్‌ నడుస్తోంది. ముందుగా 2024 సంక్రాతికి ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ 2024 మే 9న విడుదల చేయాలని చిత్ర టీమ్‌ భావిస్తున్నట్లు మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అఫిషియల్‌గా కల్కీ విడుదల తేదీని  మేకర్స్‌ ప్రకటించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement