ప్రభాస్‌ అంటే వేరే లెవెల్.. ఇక మాటల్లేవ్: కృష్ణం రాజు భార్య క్రేజీ కామెంట్స్ | Krishnam Raju Wife Shayamala devi Comments On Prabhas Kalki Movie | Sakshi
Sakshi News home page

Shayamala devi: వెయ్యి రెబల్ స్టార్స్‌ కలిపితే ప్రభాస్: శ్యామలా దేవి కామెంట్స్ వైరల్

Published Thu, Jun 27 2024 7:01 PM | Last Updated on Thu, Jun 27 2024 7:31 PM

Krishnam Raju Wife Shayamala devi Comments On Prabhas Kalki Movie

రెబల్ స్టార్‌  ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. కల్కి అద్భుతంగా ఉందంటూ ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు రూ.600 కోట్లతో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్‌ ఈ మూవీని నిర్మించారు. గురువారం ఉదయం నుంచే థియేటర్లలో కల్కి సందడి మొదలైంది.

తొలి రోజే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి(కృష్ణంరాజు భార్య) హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో కల్కి మూవీని వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె కల్కి సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రభాస్‌ ఫ్యాన్స్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో ఫైట్స్ వేరే లెవెల్.. ఇక మాటల్లేవ్ అంటూ థియేటర్‌ వెలుపల మాట్లాడారు. ప్రభాస్ 1000 రెబల్ స్టార్స్‌తో సమానమని ఆనందం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అక్కడే ఉన్న బుజ్జి కారుపై కూర్చొని సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement