'కల్కి'పై హాలీవుడ్ ప్రశంసలు.. రేంజు పెరిగిపోయింది! | Hollywood Media Praise Kalki 2898 AD Movie | Sakshi
Sakshi News home page

Kalki 2898AD: ఇంటర్నేషనల్ మీడియాలో 'కల్కి' హవా .. వేరే లెవల్!

Published Sat, Jun 29 2024 11:06 AM | Last Updated on Sat, Jun 29 2024 11:49 AM

Hollywood Media Praise Kalki 2898 AD Movie

'కల్కి' సినిమా అద్భుతాలు చేస్తోంది. దక్షిణాదిలో టాక్ పరంగా అక్కడక్కడ కాస్త మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ ఉత్తరాదితో పాటు మిగతా దేశాల్లో మాత్రం యునానిమస్ టాక్ సొంతం చేసుకుంది. ముందు నుంచే దీన్ని పాన్ వరల్డ్ సినిమాగా ప్రమోట్ చేశారు. ఇప్పుడు మూవీ టీమ్ కోరుకున్నట్లు హాలీవుడ్ మీడియా కూడా 'కల్కి'కి ఫిదా అయిపోయినట్లు కనిపిస్తోంది.

(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?)

డైరెక్టర్ నాగ్ అశ్విన్.. 'కల్కి'ని హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో తీసిన మాట వాస్తవం. వాళ్లకు మార్వెల్, డీసీ లాంటి విజువల్ వండర్స్ మూవీస్ ఉన్నాయి. మనకు అలాంటిది ఎందుకు ఉండకూడదని సైన్స్ ఫిక్షన్ కథకు మహాభారతాన్ని ముడిపెట్టి తీసిన మూవీనే 'కల్కి'. దీని రిలీజ్ తర్వాత తెలుగోళ్లు మహాభారతం గురించి తెగ మాట్లాడుకుంటున్నారు.

మరోవైపు హాలీవుడ్‌లో ప్రముఖ మీడియా సంస్థలైన డెడ్ లైన్, కొలీడర్ లాంటివి 'కల్కి' గురించి ఆర్టికల్స్ రాశాయి. అద్భుతంగా ఉందని మెచ్చుకున్నాయి. గతంలో నాగ్ అశ్విన్ ఏదైతే అనుకున్నాడే ఇప్పుడు అదే జరిగింది. ప్రభాస్ క్రేజ్ కూడా 'కల్కి' దెబ్బకు హాలీవుడ్ వరకు వెళ్లిపోయింది. ఏదేమైనా తెలుగు సినిమాకు ఆస్కార్ రావడమే ఎక్కువ అనుకున్నాం ఇప్పుడు మన మూవీ గురించి వాళ్లు ఆర్టికల్స్ రాయడం బోనస్ లాంటిది!

(ఇదీ చదవండి: గతంలో నేను తప్పు చేసిన మాట నిజమే: సమంత)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement