
ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. తాజాగా విడుదలైన సినిమాకు రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. తొలిరోజు ఏకంగా రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ ఇండియన్ సినిమాగా కల్కిని రూపొందించాడు. ఈ సినిమాలో అనేక గెస్ట్ రోల్స్ ఉన్నాయి. వాటిలో ప్రధానంగా హైలైట్ అవుతోంది విజయ్ దేవరకొండ నటించిన అర్జునుడి పాత్రే అని చెప్పవచ్చు. ఈ పాత్రలో విజయ్ పర్పెక్ట్ గా సరిపోయారంటూ నెట్టింట పెద్ద ఎత్తున్న చర్చ జరుగుతుంది.

అర్జునుడు కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో చూపించే బలమైన ఎమోషన్స్ తన నటనతో పలికించారు విజయ్ దేవరకొండ. నిడివి తక్కువే అయినా అర్జునుడిగా విజయ్ మేకోవర్, చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ కల్కిలో ఒక హైలైట్‌గా నిలుస్తున్నాయి. విజయ్ క్యారెక్టర్ స్క్రీన్ మీదకు వచ్చినప్పుడు ప్రేక్షకుల నుంచి హ్యూజ్ అప్లాజ్ వస్తోంది. విజయ్‌ను మైథాలజీ పాత్రల్లో చూసే అవకాశం అరుదు కాబట్టి కల్కి సినిమా ఆయన కెరీర్‌లోనూ ఓ స్పెషల్ మూవీ అనుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment