ఓటీటీలోకి వచ్చేస్తున్న బుజ్జి & భైరవ.. ట్రైలర్‌ చూశారా? | Kalki 2898 AD: Bujji and Bhairava Animated Series Telugu Trailer Released | Sakshi
Sakshi News home page

ఓటీటీలోకి వచ్చేస్తున్న బుజ్జి & భైరవ.. ట్రైలర్‌ చూశారా?

Published Thu, May 30 2024 4:52 PM | Last Updated on Thu, May 30 2024 6:12 PM

Kalki 2898 AD: Bujji and Bhairava Animated Series Telugu Trailer Released

సినీ ‍ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం కల్కి 2898 ఏడీ. ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ మూవీలో అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె, కమల్‌ హాసన్‌, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాలో ప్రభాస్‌ వాడిన కారు పేరు బుజ్జి. ఈ మధ్యే రిలీజైన బుజ్జి గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. అన్నట్లు ఈ బుజ్జికి హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ వాయిస్‌ అందించింది. ఈ మూవీ జూన్‌ 27న విడుదల కానుంది.

అయితే అంతకుముందే బుజ్జిని, భైరవను ఓటీటీలో చూసేయొచ్చు. బుజ్జి అండ్‌ భైరవ పేరుతో యానిమేటెడ్‌ సిరీస్‌ తెరకెక్కింది. ఈ సిరీస్‌ మే 31న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అందుబాటులోకి రానుంది. తాజాగా ఈ సిరీస్‌ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. బుజ్జి, భైరవలు అదరగొట్టేశారు. వీరిద్దరి మధ్య దోస్తీ ఎలా కుదిరిందో ఈ సిరీస్‌లో చూపించనున్నారు.  సంతోష్‌ నారాయణన్‌ అందించిన సంగీతం అయితే సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా మారనున్నట్లు కనిపిస్తోంది.

 

చదవండి: కల్కి రన్‌ టైమ్‌ ఫిక్స్‌.. భారీ బడ్జెట్‌పై ప్రభాస్‌ కామెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement