
ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ , దీపికా పదుకొనె, దిశా పటానీ ఇతర పాత్రల్లో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. ఈ చిత్రంలో భైరవ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ఈ మూవీలో ఆయన వాడిన కారు పేరు బుజ్జి. ఇప్పుడు అందరి ఆసక్తి బుజ్జి మీదే ఉంది. ప్రపంచవ్యాప్తంగా బుజ్జి గురించి ఆరా తీసున్నారు.
ఇప్పటికే బుజ్జి వాహనాన్ని నాగచైతన్య డ్రైవ్ చేసి తన అనుభవాన్ని పంచుకున్నారు. అయితే తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన ఎక్స్ పేజీలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ని ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. ప్రియమైన ఎలాన్ మస్క్ సర్.. మా బుజ్జిని చూడటానికి, డ్రైవ్ చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇది 6 టన్నుల బరువుతో సరికొత్తగా డిజైన్ చేశాం. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం, అద్భుతమైన ఇంజినీరింగ్ వర్క్‌తో నిర్మించబడింది. మీకు బుజ్జి తప్పకుండా మంచి అనుభూతిని ఇస్తుంది.' అని నాగ్ అశ్విన్ తెలిపారు.

కల్కి సినిమా గురించి ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించిన టీమ్‌కు ఎలాన్ మస్క్ నుంచి ఏదైనా సమాచారం వస్తే మాత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గురించి తప్పకుండా చర్చ జరుగుతుంది. నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్‌ను షేర్ చేస్తూ చాలామంది ఇండియన్స్ కూడా ఎలాన్ మస్క్‌ను అభ్యర్థిస్తున్నారు. తక్కువ కాలంలో ఇండియన్ ఇంజనీర్స్ తయారు చేసిన రోబోటిక్ వాహనాన్ని ఎలాన్ మస్క్ డ్రైవ్ చేయాలని ఎక్స్ వేదికగా వారు కోరుతున్నారు.
Mr @elonmusk you must try this craziest #Bujji pic.twitter.com/vouOMS7DX7
— Prabhas Fan (@ivdsai) May 29, 2024