అక్కడ ఒకరోజు ముందుగానే 'కల్కి' రిలీజ్ | Kalki 2898 AD Movie To Release Before One Day In British Film Institute, Deets Inside | Sakshi
Sakshi News home page

అక్కడ ఒకరోజు ముందుగానే 'కల్కి' రిలీజ్

Published Tue, Jun 11 2024 7:47 AM | Last Updated on Tue, Jun 11 2024 10:42 AM

Kalki 2898 AD Released In British Film Institute

ప్రభాస్‌- నాగ్‌ అశ్విన్‌ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'కల్కి: 2898 ఏడీ'. ఎపిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ చిత్రంగా వస్తున్న ఇందులో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్‌, పశుపతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్‌ 27న విడుదల కానుంది. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. అంచనాలకు మించి ట్రైలర్‌ ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

కల్కి సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లో ఉన్న బ్రిటీష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ (బీఎఫ్ఐ) ఐమ్యాక్స్‌లో  ఈ మూవీ తెలుగు వెర్షన్‌  ప్రీమియర్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం27న విడుదల కానుంది. అయితే, ఇక్కడ మాత్రం ఒక రోజు ముందుగానే  జూన్ 26నే మొదటి ఆట పడనుంది. రాత్రి 8.30 గంటలకు మొదటి ప్రీమియర్ స్టార్ట్‌ కానుంది. అక్కడ ఒక సినిమా ప్రీమియర్‌ షో పడటం చాలా అరుదు. గతంలో ఆర్ఆర్ఆర్ మూవీని కూడా ఇక్కడ ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కల్కి చిత్రం కూడా ఈ ఘనతను సాధించి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement