
ప్రయోగాలకు పెట్టింది పేరు కమల్ హాసన్. భారతీయ సినీ నటుల్లో ఆయన చేసినన్ని ప్రయోగాలు మరే నటుడు చేయలేదని చెప్పడం అతిశయోక్తి కాదు. వెండితెరపై ఆయన వేసినన్ని గెటప్స్ ఎవరూ వేయలేదు. దశావతారం సినిమాలో పది గెటప్స్‌లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. అంతకు ముందు భారతీయుడు సినిమాలో వయసు మీరిన వ్యక్తిగా తెరపై కనిపించి ఆకట్టుకున్నాడు. చాలా కాలం తర్వాత మళ్లీ ‘కల్కి 2898’ చిత్రంలో కమల్ మరో వైవిధ్యమైన పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజైన ట్రైలర్‌లో కమల్ లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
(చదవండి: అక్కడ ఒక్కరోజు ముందుగానే కల్కి 2898 రిలీజ్)
ఈ సినిమాలో కమల్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కమల్ పాత్ర పేరు ఏంటి? ఎలా ఉండబోతుంది? అనేది ఇంతవరకు రివీల్ చేయలేదు. ఆయన పాత్రను ప్రత్యేకంగా పరిచయం చేస్తారని అంతా భావించారు. కానీ డైరెక్టర్‌గా ట్రైలర్‌తోనే కమల్ పాత్రను చూపించి షాకిచ్చారు. ట్రైలర్‌లో ఆయన గుండు, ముడతలు పడిన చర్మంతో డిఫరెంట్‌గా కనిపించాడు. క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప ఆయన కమల్ అని గుర్తించలేం. ట్రైలర్‌లో కనిపించింది కొద్ది సెకన్లే అయినా.. ఆ ఇంపాక్ట్ మాత్రం వేరేలా ఉంది. ఇప్పుడంతా కమల్ గెటప్ గురించే మాట్లాడుకుంటున్నారు.
మేకప్‌కే మూడు గంటల సమయం?
కల్కి కోసం కమల్ ప్రోస్థటిక్ మేకప్ వేసుకున్నారు. కేవలం మేకప్ వేయడానికే దాదాపు 3 గంటల సమయం పట్టేదని తెలుస్తోంది. నాగ్ అశ్విన్ ఈ పాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకొని తీర్చిదిద్దారట. కమల్ మేకప్ కోసం విదేశీ నిపుణుల్ని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.సెకండాఫ్‌లో కమల్ పాత్ర ఎంట్రీ ఇస్తుందని, చివరి 15 నిమిషాల్లో ఆయన నటవిశ్వరూపం తెరపై చూస్తారట. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొన్, దిశా పటానీ కీలక పాత్రలో పోషించారు. జూన్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Comments
Please login to add a commentAdd a comment