
ప్రభాస్ 'కల్కి' సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. అదేంటి.. రిలీజ్ డేట్‌కి నెలరోజులు లేదు. ఇప్పుడు షూటింగ్ పూర్తి కావడం ఏంటని అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే. ఈ విషయాన్ని చిత్రబృందంలో కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో ఇది బయటపడింది. అలానే కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ కూడా టీమ్ అందరికీ ఇచ్చారు. ఇంతకీ ఏంటా బహుమతులు?
'బాహుబలి' తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. వరసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో ఒకటే ఈ 'కల్కి'. తొలుత 'ప్రాజెక్ట్ కే' పేరుతో సెట్స్‌పైకి వెళ్లింది. లాక్ డౌన్ వల్ల లేట్ అవుతూ వచ్చింది. అయితే గత మూడేళ్ల నుంచి షూటింగ్ చేస్తూ వచ్చారు. మొన్నీమధ్య 'బుజ్జి x భైరవ' పేరుతో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఈవెంట్ నిర్వహించారు.
(ఇదీ చదవండి: 'లవ్ మీ' సినిమాకు తొలిరోజు షాకింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?)
అయితే షూటింగ్ దాదాపు పూర్తయినప్పటికీ కొన్ని సీన్స్ పెండింగ్‌లో ఉన్నాయని, తాజాగా ప్యాచ్ వర్క్ సీన్స్ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేశారు. ఈ క్రమంలోనే చిత్ర బృందానికి దర్శకుడు నాగ్ అశ్విన్ ఫొటోలతో డిజైన్ చేసిన ఓ ఫన్నీ మీమ్ టీషర్ట్, వెండి కృష్ణుడి బొమ్మ, గొలుసు, నిర్మాణ సంస్థ ప్రేమతో రాసిన ఓ లెటర్, కల్కి బ్యాడ్జ్ ఇచ్చారు. ఇప్పుడు వీటికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జూన్ 27న థియేటర్లలోకి రాబోతున్న 'కల్కి' మూవీలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె నటించింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణ్ సంగీతమందించగా, నాగ్ అశ్విన్ దర్శకుడు. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‍తో నిర్మించింది.
(ఇదీ చదవండి: 'సలార్ 2' పక్కన పెట్టేశారని రూమర్స్.. ఒక్క ఫొటోతో క్లారిటీ)
fri ,sat patch works tho #Kalki2898AD wrapped ✅✅ pic.twitter.com/xx2j3YyzQL
— 🦖 (@Salaarified22) May 26, 2024
Nagi 😂#Kalki2898AD #Prabhas pic.twitter.com/1trMhgBtS5
— . (@Praveenmudhir1) May 26, 2024
Comments
Please login to add a commentAdd a comment