ప్రభాస్ 'కల్కి' థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తోంది. కొన్నిచోట్ల మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఓవరాల్‌గా థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన మూవీ అని చాలామంది అంటున్నారు. 3 గంటల నిడివితో 'కల్కి'ని తెరకెక్కించినప్పటికీ కొన్ని ప్రశ్నలని అలానే వదిలేశారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నట్లు ఇందులోను ఓ రెండు సందేహాలు అలానే ఉండిపోయాయి. ఇంతకీ అవేంటి? స్పాయిలర్స్ చెప్పకుండా కాస్త డిస్కస్ చేసుకుందాం.
'బాహుబలి' తర్వాత తెలుగు ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ ఉద్ధృతమైంది. ఎంతలా అంటే చాలామంది టాలీవుడ్ దర్శకులు తమ తమ సినిమాల్ని రెండు పార్టులుగా తీస్తున్నామని.. ఆయా చిత్రాల చివర్లో హింట్ ఇచ్చారు. కాకపోతే ఇవేవి కూడా 'బాహుబలి' రేంజులో ఆసక్తిని కలిగించలేకపోయాయి. కానీ 'కల్కి'కి మాత్రం ఇది బాగానే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు.
(ఇదీ చదవండి: 'కల్కి' మూవీలో కృష్ణుడిగా చేసిన నటుడెవరో తెలుసా?)
'కల్కి' చూసిన చాలామంది సినిమా సూపర్ ఉందని అంటున్నారు. కానీ ఇందులో కల్కి ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటే చెప్పలేరు. మూవీలో దీపికా పదుకొణె పాత్ర సుమతి గర్భంతో ఉండగా, ఈమె కడుపులో దైవంశ ఉన్నట్లు చూపించారు. దీనిబట్టి చూస్తే ఈమెకు పుట్టే బిడ్డనే 'కల్కి'. కాకపోతే ఈ పాత్రలో ప్రభాస్ కనిపించకపోవచ్చు. ఎందుకంటే మహాభారతం సీన్లలో భాగంగా 'కల్కి' క్లైమాక్ల్‌లో కీలక పాత్రలో ప్రభాస్ కనిపించాడు. మరి కల్కిగా కూడా ప్రభాసే కనిపిస్తాడా వేరే ఎవరానా ఉంటారా అనేది పార్ట్ 2 వస్తే గానీ తెలియదు.
ఇకపోతే 'కల్కి'లో కమల్ హాసన్ సుప్రీం యాష్కిన్ అనే విలన్‌గా చేశాడు. కాంప్లెక్స్ ప్రపంచంలో ఇతడు మహిళలకు గర్భం తెప్పించి ప్రాజెక్ట్-కె అనే ఓ మిషన్ నిర్వహిస్తుంటాడు. అసలు ఇదంటే ఏంటి? ఎందుకు చేస్తున్నాడనేది కూడా సరిగా ఎష్టాబ్లిష్ చేయకుండానే 'కల్కి' చిత్రాన్ని ముగించారు. బహుశా ఈ రెండింటికి సమాధానాలు.. 'కల్కి' సినిమాటిక్ యూనివర్స్‌లో వచ్చే తర్వాత భాగంలో రివీల్ చేస్తారేమో? 'బాహుబలి'లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ఒక్కటే ప్రశ్న. 'కల్కి'లో మాత్రం రెండు సందేహాలు ఆలోచనలో పడేశాయ్.
(ఇదీ చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment