ప్రపంచంలోని అందరూ కల్కికి కనెక్ట్‌ అవుతారు: నాగ్‌ అశ్విన్‌ | Nag Ashwin Interesting Comments About Kalki 2898 AD Movie, Deets Inside | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోని అందరూ కల్కికి కనెక్ట్‌ అవుతారు: నాగ్‌ అశ్విన్‌

Published Wed, Jun 19 2024 12:29 AM | Last Updated on Wed, Jun 19 2024 11:13 AM

Nag Ashwin about Kalki 2898 AD movie

‘‘కల్కి 2898 ఏడీ’ చిత్రకథ రాయడానికి నాకు ఐదేళ్లు పట్టింది. ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మైథాలజీని చూసి ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నా’’ అని డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ అన్నారు. ప్రభాస్‌ హీరోగా నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సి. అశ్వినీదత్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ మూవీ నుంచి ఆదివారం విడుదలైన ‘భైరవ ఆంథమ్‌’ ఇండియన్స్‌ బిగ్గెస్ట్‌ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా టాప్‌ చార్ట్‌లో నిలిచినట్లు మేకర్స్‌ తెలిపారు.

కాగా ‘ఎపిక్‌ జర్నీ ఎపిసోడ్‌ 1 – ది ప్రిల్యూడ్‌ ఆఫ్‌ కల్కి 2898 ఏడీ’ అనే వీడియోను విడుదల చేసింది యూనిట్‌. ఆ వీడియోలో డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పటి నుంచి నాకు ΄పౌరాణిక చిత్రాలంటే చాలా ఇష్టం. ‘పాతాళ భైరవి, భైరవ ద్వీపం, ఆదిత్య 369’ ఇష్టమైన సినిమాలు. హాలీవుడ్‌ ‘స్టార్‌ వార్స్‌’ లాంటి సినిమాలు చూసినప్పుడు చాలా బాగున్నాయనిపించేది.

కానీ ఇలాంటివి అక్కడే ఉండాలా? మన కథలతోనూ సినిమా తీయొచ్చు కదా అనిపించేది. ఆ ఆలోచనలోంచి పుట్టినదే ‘కల్కి 2898 ఏడీ’. మన మహాభారతంలో ఎన్నో గొప్ప పాత్రలు ఉన్నాయి. కృష్ణావతారంతో అది ఎండ్‌ అవుతుంది. అక్కడి నుంచి కలియుగానికి ప్రవేశించినప్పుడు ఈ కథ ఎలా వెళుతుందనే ఊహతో ‘కల్కి’ రాశాను. కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోని అందరూ ఈ కథకు రిలేట్‌ అవుతారు’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement