ప్రభాస్‌తో పోటీ కాదు.. నాదొక పాత్ర మాత్రమే.. | Vijay Deverakonda First Reaction On His Role In Kalki 2898 AD Movie, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Kalki 2898 AD Movie: ప్రభాస్‌తో పోటీ కాదు.. నాదొక పాత్ర మాత్రమే..

Jul 1 2024 8:13 AM | Updated on Jul 1 2024 8:51 AM

Vijay Deverakonda First Reaction On His Role In Kalki 2898 AD

నాగ్, ప్రభాస్‌ అంటే చాలా ఇష్టం కల్కితో తెలుగు సినిమా దిశ మారింది
‘సాక్షి’తో విజయ్‌ దేవరకొండ  

నాగీ (దర్శకులు నాగ్‌ అశ్విన్‌), ప్రభాస్‌ల కోసమే కల్కి సినిమాలో నటించానని.. ఆ ఇద్దరంటే తనకెంతో ఇష్టమని ప్రముఖ సినీనటుడు విజయ్‌ దేవరకొండ తెలిపారు. ఓ ప్రయివేటు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయ్‌.. ఇటీవల విడుదలైన కల్కి సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కల్కి సినిమాతో భారతీయ సినిమాను, ముఖ్యంగా తెలుగు సినిమాను ఎక్కడికో తీసుకెళ్లగలిగామని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 సినిమా చూస్తూ ఎమోషనల్‌కు లోనయ్యానన్నారు. ‘కల్కిలో ప్రభాస్‌ గొప్పనా, నేను గొప్పనా అనే వాదనలు కాదు... నాగ్‌ అశి్వన్‌ సృష్టించిన వినూత్న ప్రపంచంలో తామొక పాత్రలమేనని’ వివరించారు. వైజయంతి సంస్థతోనే తన ప్రయాణం మొదలైందని, ఎప్పుడు అడిగినా వారి సినిమాల్లో నటిస్తానన్నారు. 

నాగ్‌ ప్రతి సినిమాలో నటిస్తూ లక్కీ చార్మ్‌గా మారారనే ప్రశ్నకు సమాధానంగా.. నాగ్‌ దర్శకత్వంలో తను అతిథి పాత్రలు పోషించిన మహానటి, కల్కి సినిమాలు బాగున్నాయి కాబట్టే హిట్‌ అవుతున్నాయని, ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని మరోసారి తన సింప్లిసిటీని నిరూపించుకున్నారు. కల్కి పార్ట్‌–2లో మీ పాత్ర మరింతగా ఉంటుందని నిర్మాత అశ్వినీదత్‌ ఓ సమావేశంలో అన్నారనే మరో ప్రశ్నకు సమాధానంగా..అశి్వనీదత్‌ అంటే అది కరెక్టేనని సినీ ప్రియులకు హింట్‌ ఇచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement