
‘‘కల్కి 2898 ఏడీ’ సినిమా విడుదల కాకముందే యానిమేషన్ సిరీస్‌ను రిలీజ్ చేయడం మా ప్రోడక్షన్ హౌస్ ధైర్యంగా తీసుకున్న నిర్ణయం.. చెప్పాలంటే ఇదొక ప్రయోగమే. నాలుగైదేళ్లుగా దీని కోసం పని చేస్తున్నాం’’ అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు. ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర పాత్రలు పోషించారు.
వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో భైరవగా ప్రభాస్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఆయన వాడిన కారు పేరు బుజ్జి. కాగా బుజ్జి–భైరవ 2డీ యానిమేషన్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేటి నుంచి ప్రసారం కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ వేడుకలో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ – ‘‘కల్కి 2898 ఏడీ’ మూవీ రిలీజ్‌కి ముందే ఒక యానిమేషన్ సిరీస్ లాంచ్ చేయాలనే ఐడియా నచ్చింది. ఇందుకోసం ‘ఛోటా భీమ్’తో పాటు ఎన్నో యానిమేషన్ సిరీస్‌లను రూపొందించిన గ్రీన్ గోల్డ్ సంస్థతో కలిసి పని చేశాం. ఈ ఐదేళ్లలో వైజయంతీ ఆటోమొబైల్స్, వైజయంతీ యానిమేషన్, వైజయంతీ మూవీస్ అనే మూడు డిఫరెంట్ కంపెనీలను నడిపించాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment