
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కల్కి 2898ఏడీ’ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ చిత్రంగా భారీ బడ్జెట్‌తో అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. జూన్ 27న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌కు మంచి ఆధరణ లభించింది. నేడు సాయింత్రం రెండో ట్రైలర్‌ను కూడా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కల్కి సెన్సార్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. సినిమా రన్ టైమ్ 180 నిమిషాలు ఉంది. గత కొన్నేళ్లుగా మూడు గంటలపాటు రన్‌టైమ్‌తో వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపాయి. అయితే, ఇప్పుడు కల్కి కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. సైన్స్ ఫిక్షన్ కథతో వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుందని చెప్పవచ్చు.
ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి సినిమా బెనిఫిట్ షోలను ప్రదర్శించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఏపీ, తెలంగాణలో ఈ మూవీని రూ. 140 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. కల్కి సేఫ్ జోన్‌లో ఉండాలంటే బెనిఫిట్ షోలతో పాటు మొదటి వారం పాటు టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వాలు ఇవ్వాల్సి ఉంటుంది. కల్కి సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ప్రభుత్వాల నుంచి ఈ వెసులుబాటు తప్పదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment