Kamal Haasan In Kalki Glimpse: డార్లింగ్ ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. 'కల్కి 2989 AD' అనే టైటిల్‌ని ఫిక్స్ చేస్తూ, గ్లింప్స్ వీడియోని అర్థరాత్రి ఒంటి గంటకు విడుదల చేశారు. సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఇందులో చూపించారు. గ్లింప్స్ కాబట్టి పెద్దగా స్టోరీని ఏంటనేది రివీల్ చేయలేదు. కేవలం ప్రధాన పాత్రల్ని మాత్రమే చూపించారు. అయితే ఈ గ్లింప్స్‌లో కమల్‌హాసన్ ఎక్కడా కనిపించలేదు.
ట్విస్ట్ బయటపెట్టిన నాగీ
శాన్ డియాగోలో జరిగిన కామికాన్ ఈవెంట్‌లో ప్రభాస్ 'కల్కి' గ్లింప్స్‌ని విడుదల చేశారు. చిత్రబృందంతోపాటు రానా అక్కడికి వెళ్లాడు. ఇతడే మొత్తం 'కల్కి' టీమ్‌ని స్టేజీపై పిలిచి అందరికీ పరిచయం చేశాడు. అయితే మాటల్లో భాగంగా.. 'గ్లింప్స్‌లో అందరూ ఉన్నారు కమల్ హాసన్ ఎక్కడా కనిపించలేదు ఏంటి?' అని రానా అడిగాడు. దీనికి బదులిచ్చిన డైరెక్టర్ నాగ్ అశ్విన్.. 'గ్లింప్స్ మొత్తంలో ఆయన ఉన్నారు. కానీ మీకు తెలియదు' అని ఆన్సర్ ఇచ్చాడు. దీంతో ప్రేక్షకుల బుర్ర తిరిగిపోయింది.
(ఇదీ చదవండి: ఆ టాలీవుడ్ హీరోతో కలిసి కచ్చితంగా సినిమా చేస్తాను: ప్రభాస్)
కమల్ ఎక్కడ?
ఎందుకంటే గ్లింప్స్ చూస్తే ప్రభాస్ కల్కిగా కనిపించబోతున్నాడని అర్థమైంది. ఈ కథంతా 2989 సంవత‍్సరంలో జరగబోతుందని క్లారిటీ వచ్చింది. అశ్వత్థామ పాత్రని అమితాబ్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. విలన్ గ్యాంగ్ బంధించిన వాళ్లలో దీపిక పదుకొణె ఉన్నట్లు అనిపిస్తుంది. మిగతా పాత్రలు కూడా చూపించారు. అయితే 75 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో కమల్ హాసన్ ఎక్కడా కనిపించలేదు.
కమల్‌ది ఆ పాత్రేనా?
అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్ ప్రకారం.. 'కల్కి' మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, ఇందులో హీరో ఒకరు విలన్ ఒకరు అని అంటున్నారు. ఆ విలన్ కమల్ హాసన్ అని, కాకపోతే ప్రభాస్ రూపంలో కనిపిస్తాడనే టాక్ వినిపిస్తోంది. టీజర్ మొత్తంలో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి మనకు ఎవరెవరనేది తెలియకపోవచ్చు. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. నిజమెంత అనేది 'కల్కి' థియేటర్లలోకి వస్తే గానీ తెలియదు.
(ఇదీ చదవండి: ప్రాజెక్ట్- కె.. తన క్యారెక్టర్‌పై ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్!)
Comments
Please login to add a commentAdd a comment