శక్తులన్నీ ఏకమయ్యాయి  | Kalki 2898 AD Announced New Release Date | Sakshi
Sakshi News home page

శక్తులన్నీ ఏకమయ్యాయి 

Published Sun, Apr 28 2024 5:38 AM | Last Updated on Sun, Apr 28 2024 5:38 AM

Kalki 2898 AD Announced New Release Date

థియేటర్స్‌లో ‘కల్కి’ రాక ఖరారైంది. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఫ్యూచరిస్ట్‌ సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌ ‘కల్కి 2898 ఏడీ’ ఈ ఏడాది జూన్‌ 27న విడుదల కానుంది. ‘‘మెరుగైన భవిష్యత్‌ కోసం అన్ని శక్తులు ఏకమయ్యాయి’’ అనే క్యాప్షన్‌తో ‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు మేకర్స్‌.

మహాభారతం కాలంలో ఆరంభమై 2898 ఏడీలో ఈ సినిమా ముగుస్తుందనీ, ఆరువేల ఏళ్ల కాలమానంలో ఈ కథ సాగుతుందనీ సమాచారం. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. సి. అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:  సంతోష్‌ నారాయణన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement