డార్లింగ్ ప్రభాస్ 'కల్కి'పై రోజురోజుకీ హైప్ మెల్లగా పెరుగుతోంది. మొన్నటివరకు ప్రమోషన్స్ చేయడం లేదని బెంగపడిన ఫ్యాన్స్.. ముంబైలో బుధవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ఫుల్ హ్యాపీ. ఇక ఇప్పుడు మరో లేటేస్ట్ వీడియోతో వచ్చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్.. సినిమా ఎలా ఉండబోతుందనేది ఆల్మోస్ట్ చెప్పేశాడు. వరల్డ్ ఆఫ్ కల్కి పేరుతో తాజాగా రెండో వీడియోని రిలీజ్ చేశాడు.
(ఇదీ చదవండి: ప్రభాస్ వల్లే ఇలా మారిపోయాను: దీపికా పదుకొణె)
ఈ వీడియోలో భాగంగా దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. 'కల్కి' మూవీలో కాశీ, కాంప్లెక్స్, శంభాల అనే మూడు ప్రపంచాలు ఉంటాయని చెప్పాడు. అలానే 3000 సంవత్సరాల తర్వాత కాశీ నగరంలో నీళ్లు ఉండవని, దీంతో అప్పడు ఎలా ఉంటుందో ఊహించుకుని అన్ని వస్తువులు తయారు చేశామని చెప్పుకొచ్చాడు. అలానే కాశీలో తిరగేసిన పిరమిడ్ ఆకారంలో ఉండే కాంప్లెక్స్ అనే ప్లేసులో అన్ని సదుపాయాలు ఉంటాయని పేర్కొన్నాడు.
అయితే కాశీ, కాంప్లెక్స్, శంభాలలో మనుషులు దుస్తుల దగ్గర నుంచి ఉపయోగించే వస్తువుల వరకు ఎవరికీ వాళ్లకు వేర్వేరుగా ఉంటాయని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో బట్టి చూస్తే ఈ మూడు ప్రపంచాల్లో ఉండే మనుషుల వల్ల హీరో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనేదే మెయిన్ స్టోరీ అని తెలుస్తోంది. ఓవైపు ఫన్ ఎలిమెంట్స్ ఉంటూనే మరోవైపు గ్రాఫిక్స్, యాక్షన్ సీన్స్‌తో పాటు ఊహించని అతిథి పాత్రలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)
Comments
Please login to add a commentAdd a comment