బ్రెయిన్‌ ఉంటే సరిపోతుందా... | Kalki is a sci fi thriller directed by Nag Ashwin | Sakshi
Sakshi News home page

బ్రెయిన్‌ ఉంటే సరిపోతుందా...

May 20 2024 3:39 AM | Updated on May 20 2024 5:22 AM

Kalki is a sci fi thriller directed by Nag Ashwin

భైరవ బెస్ట్‌ ఫ్రెండ్‌ బుజ్జి... కానీ బుజ్జి అంటే మనిషి కాదు. మరి.. బుజ్జి అనేది వాహనమా? లేక ఓ టైమ్‌ మిషన్‌లాంటి పరికరమా? అనేది ఈ నెల 22న తెలుస్తుంది. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ ఫ్యూచరిస్టిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న ఈ సినిమాను అశ్వినీదత్‌ నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాలో భైరవ ΄ాత్రధారిగా ప్రభాస్, అశ్వత్థామ ΄ాత్రలో అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మరో సూపర్‌ హీరోలాంటి బుజ్జి ΄ాత్ర కూడా ఉంది. ఈ ΄ాత్రను పూర్తిగా చూపించకుండా ఓ వీడియోను విడుదల చేశారు మేకర్స్‌. ఈ పాత్రకు హీరోయిన్‌ కీర్తీ సురేష్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. 

‘మనుషుల శరీరాన్ని బ్రెయిన్‌ కంట్రోల్‌ చేసినట్లే.. బుజ్జి బాడీని కూడా బ్రెయిన్‌ కంట్రోల్‌ చేస్తుంటుంది’ (నాగ్‌ అశ్విన్‌), ‘హాయ్‌.. నేను బుజ్జి బ్రెయిన్‌... బ్రెయిన్‌ ఉంటే సరిబ్రెయిన్‌ ఉంటే సరిపోతుందా...తుందా... బాడీ కూడా కావాలి కదా.. భైరవ ఎక్కడికీ.. నా బాడీ బిల్డ్‌ చేయడానికేనా..’ (కీర్తీ సురేష్‌ వాయిస్‌ ఓవర్‌), ‘నీ టైమ్‌ స్టార్టైంది బుజ్జి.. పదా!’ (ప్రభాస్‌) అనే డైలాగ్స్‌ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ బుజ్జి గురించిన పూర్తి వివరాలను ఈ నెల 22న వెల్లడిస్తామని మేకర్స్‌ తెలి΄ారు. ఇక ‘కల్కి 2898 ఏడీ’ జూన్‌ 27న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement