Kalki 2898 AD : ప్రమోషన్స్‌కి భారీ ప్లాన్‌..నెల రోజుల్లో ఎన్నో సర్‌ప్రైజెస్‌! | Kalki 2898 AD Movie Promotional Events Plan Till June 27th | Sakshi
Sakshi News home page

Kalki 2898 AD : ప్రమోషన్స్‌కి భారీ ప్లాన్‌..నెల రోజుల్లో ఎన్నో సర్‌ప్రైజెస్‌!

Published Tue, May 28 2024 6:30 PM | Last Updated on Tue, May 28 2024 6:47 PM

Kalki 2898 AD Movie Promotional Events Plan Till June 27th

బుజ్జి(కారు) పరిచయంతో ‘కల్కి 2898’ సినిమా ప్రమోషన్స్‌ని స్టార్ట్‌ చేశారు మేకర్స్‌. బుజ్జి కోసం ప్రత్యేక ఈవెంట్‌ని ఏర్పాటు చేయడం.. లైవ్‌లో ప్రభాస్‌తో డ్రెవింగ్‌ చేయించి హడావుడి చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ బయటకు రాలేదు. సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజుల(జూన్‌  27) సమయం మాత్రమే ఉంది. పాన్‌ వరల్డ్‌ సినిమాకు ఇది చాలా తక్కువ సమయమే. ఉన్న ఈ కొద్ది సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునేలా ప్లాన్‌ చేస్తున్నారట మేకర్స్‌. 

ఎన్నికల ఫలితాల(జూన్‌ 4) తర్వాత వరుస అప్‌డేట్స్‌, ఈవెంట్స్‌తో దేశ మొత్తం ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారట. ఈ నెల రోజుల ప్రమోషన్స్‌కి కావాల్సిన కంటెంట్‌ అంతా రెడీ చేసి పెట్టారట. ఎలెక్షన్స్‌ రిజల్ట్‌ తర్వాత వరుసగా ఈవెంట్స్‌ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు బుజ్జికి మించిన సర్‌ప్రైజెస్‌ ఈ చిత్రంలో చాలానే ఉన్నాయట. హీరోయిన్లు దీపికా పదుకొణె, దిశా పటానిల పరిచయం కూడా కొత్తగా ప్లాన్‌ చేస్తున్నారట. అలాగే ఈ చిత్రంలో దుల్కర్‌ సల్మాన్‌తో పాటు నాని కూడా కీలక క్యామియోలు చేసినట్లు తెలుస్తోంది. తొలుత వీరిద్దరి పాత్రలను సస్పెన్స్‌గా ఉంచుదాం అనుకున్నారట. కానీ మీడియాకు లీకవ్వడంతో ప్రమోషన్స్‌లోనే వీరి పాత్రలను పరిచయం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఒకవేళ వారి పాత్రలను రివీల్‌ చేస్తే మాత్రం.. ‘బుజ్జి’కి మించేలా ఈవెంట్‌ జరపాలని కూడా ఆలోచనలు చేస్తున్నారట. కమల్‌ హాసన్‌ని కూడా ప్రమోషన్స్‌కి తీసుకొచ్చే ఆలోచన కూడా చేస్తున్నారట. మొత్తానికి వచ్చే నెలలో ‘కల్కి 2898’ నుంచి వరస అప్‌డేట్స్‌ వచ్చే అవకాశం ఉండడంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్‌, అమితాబ్‌ బచ్చన్‌, అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నటీనటుల రెమ్యునరేషన్‌తో కలిసి ఈ చిత్రానికి దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‌ అయినట్లు ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తోంది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement