
ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ, శోభన, అన్నా బెన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. భైరవ పాత్రలో ప్రభాస్, సుమతి పాత్రలో దీపిక, అశ్వత్థామ పాత్రలో అమితాబ్, సుప్రీమ్ యాక్సిన్‌గా కమల్ కనిపిస్తారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి. అశ్వినీదత్ నిర్మించిన ‘కల్కి 2898 ఏడీ’ ఈ నెల 27న రిలీజ్ కానుంది.
కల్కి సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ భారీగా పెంచారు. రెండు ట్రైలర్స్ రిలీజ్ చేయడం వల్ల ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు.
అయితే తాజాగా కల్కి థీమ్ సాంగ్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శ్రీకృష్ణుని జన్మస్థలం అయిన ఉత్తర ప్రదేశ్‌లోని మధుర నగరంలో నేడు ఈ థీమ్ సాంగ్‌ను విడుదల చేస్తామని తెలిపారు.
Unveiling the #ThemeOfKalki at Lord Krishna’s birthplace, Mathura in Uttar Pradesh.
Song will be out Tomorrow.#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth… pic.twitter.com/5p2SZb9hbN— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 23, 2024
Comments
Please login to add a commentAdd a comment