Kamal Haasan Reveals Why He Choose Villain Role In Prabhas Kalki 2898 AD Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Kamal Haasan Role In Kalki 2898 AD: 'కల‍్కి'లో విలన్‌ పాత్రకి అందుకే ఒప్పుకొన్నా

Published Fri, Jul 21 2023 4:45 PM | Last Updated on Fri, Jul 21 2023 5:28 PM

Kamal Haasan About Kalki 2898 AD Villain Role - Sakshi

డార్లింగ్ ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. శాన్ డియాగోలో జరుగుతున్న కామికాన్ ఈవెంట్‌కి హాజరైన చిత్రబృందం.. 'కల్కి 2898 AD' అనే పేరుని టైటిల్‌గా ఫిక్స్ చేసింది. గ్లింప్స్ వీడియోని గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేసింది. ఇది చూసి ప్రేక్షకులు ఇప్పటికే ఫిదా అయిపోతున్నారు. అలానే వీడియోలో కమల్ హాసన్ ఎక్కడా అని తెగ వెతికేస్తున్నారు.

'కల్కి' చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ నటిస్తున్నారని చాన‍్నాళ్ల క్రితమే ప్రకటించారు. కొన్ని రోజుల ముందు.. కమల్ హాసన్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నట్లు బయటపెట్టారు. ఇందులో ఆయన విలన్ లేదా మరేదైనా పాత్ర చేస్తున్నారా అని అందరూ అనుకున్నారు. కామికాన్ ఈవెంట్‌కి హాజరైన కమల్.. సినిమాలో తన రోల్‌పై ఫుల్ క్లారిటీ ఇచ‍్చేశారు.

(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' గ్లింప్స్‌లో కమల్‌హాసన్.. ఎక్కడో గుర్తుపట్టారా?)

'ఓ సినిమాలో హీరో పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. విలన్ రోల్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ సినిమాలో నేను విలన్‌గా కనిపించబోతున్నాను. ప్రతినాయకుడు పాత్ర కాబట్టే దీన్ని అంగీకరించాను. అలానే ఓ చిత్రానికి ప్రేక్షకులు ఎంతో ముఖ్యం. మా లాంటి యాక్టర్స్‌ని స్టార్స్ చేసేది వాళ్లే' అని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. 

అయితే 'కల్కి' సినిమాలో విలన్‌గా చేసేందుకు కమల్ హాసన్ ఒప్పుకోవడం చాలామందిని ఆశ‍్చర్యపరిచింది. 'విక్రమ్' లాంటి బ్లాక్‌బస్టర్‌తో మళ్లీ సక్సెస్ ట్రాక్‌పై వచ్చిన కమల్.. 'కల్కి'లో నటించడం వెనక అలనాటి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు హస్తం ఉందని తెలుస్తోంది. 'కల్కి'కి మెంటార్‌గా ఉన్న ఆయనే.. కమల్‌తో మాట్లాడి ఒప్పించారని టాక్. సరే ఇదంతా పక్కనబెడితే ప్రభాస్-కమల్ మధ్య వచ‍్చే సీన్స్ ఎలా ఉండబోతున్నాయా అని అందరూ వెయిటింగ్. 

(ఇదీ చదవండి: వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి డేట్ ఫిక్సయ్యిందా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement