కౌరవుల పేర్లన్నీ మీకు తెలుసా? | Can You Name all the Kauravas, watch this song | Sakshi
Sakshi News home page

కౌరవుల పేర్లన్నీ మీకు తెలుసా?

Published Thu, Jun 26 2014 1:07 PM | Last Updated on Sat, Sep 2 2017 9:26 AM

కౌరవుల పేర్లన్నీ మీకు తెలుసా?

కౌరవుల పేర్లన్నీ మీకు తెలుసా?

మహాభారతం గురించి విన్నారు కదా.. టీవీలలో కూడా చాలామంది బీఆర్ చోప్రా తీసిన మహాభారతం సీరియల్ కూడా చూసే ఉంటారు. అందులో పాండవుల పేర్లు ఐదూ మీకు తెలుసు కదూ. మరి కౌరవుల పేర్లు తెలుసా? దుర్యోధనుడు, దుశ్శాసనుడు .. వీళ్లిద్దరి పేర్లు చాలామంది చెబుతారు. మహా అయితే మరికొందరు మాత్రం పాండవ పక్షపాతి అయిన వికర్ణుడి పేరు కూడా చెప్పగలరు. కానీ మొత్తం అందరి మంది పేర్లు చెప్పగలరా? పిల్లలే కాదు.. పెద్దవాళ్లలో కూడా నూటికి 99 మందికి ఆ పేర్లు తెలియకపోవచ్చు.

అందుకే.. పిల్లలు, పెద్దవాళ్లు అందరికీ విజ్ఞానం పెంచేందుకు కల్చర్ మెషీన్, షిట్జెంజిగిల్స్ అనే గ్రూపు ఒక అద్భుతమైన వీడియోను రూపొందించింది. కరావోకే స్టైలులో కలిసి పాడేలా ఈ కౌరవుల పాటను వారు రూపొందించారు. ఈ పాటను చూస్తే మొత్తం కౌరవులందరి పేర్లూ ఇట్టే తెలిసిపోతాయి. సరదాగా ఈ పాట చూడండి.. మీరు కూడా కౌరవులందరి పేర్లు నేర్చుకోండి మరి!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement