
దీపికా పదుకొణె (ఫైల్ ఫొటో)
ముంబై : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ మహా భారతాన్ని తెరకెక్కించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయంటూ బీ టౌన్‌లో వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త హల్‌చల్ చేస్తోంది. ఒక జాతీయ మీడియా కథనం ప్రకారం.. 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ పౌరాణిక చిత్రంలో పాత్రలన్నింటికీ ప్రముఖులనే ఎంపిక చేయాలని ఆమిర్ భావిస్తున్నారట.
మహాభారతంలో అతి ముఖ్యమైన ద్రౌపది పాత్రకు దీపికా పదుకొనెను తీసుకోవాలని టీమ్ భావిస్తున్నట్లు సమాచారం. ‘పద్మావత్’ సినిమాతో మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్న దీపికా.. ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే ఆమె కెరీర్‌లో మరో కలికితురాయి చేరినట్లే. దీపికా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు పదేళ్లయినప్పటికీ ఇంత వరకు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌తో స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఈ సినిమాతోనైనా వారిద్దరి కాంబినేషన్ సాధ్యమవుతుందో చూడాలి మరి.
Comments
Please login to add a commentAdd a comment