
1. బిలం నుండి బయటకు వచ్చిన పాండవులు ఏం చేశారు?
2. పాండవుల పరిస్థితి ఎలా ఉంది?
3. భీముడు ఏ విధంగా సాగాడు?
4. కుంతి సహా మిగిలిన నలుగురు పాండవులు ఏ స్థితిలో ఉన్నారు?
5. భీముడు నీటి కోసం ఏం చేశాడు?
6. భీముడు కొలను చూసి ఏం చేశాడు?
7. అమావాస్య రోజు రాత్రి ఏం జరిగింది?
8. భీముడి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి?
జవాబులు
1. పాండవులు గంగ దాటి, మహారణ్యంలోకి ప్రవేశించారు. అది చీమలు దూరని చిట్టడవి.ఆ రోజు కృష్ణ చతుర్దశి. దట్టంగా చీకటి ఆవరించి ఉంది. కంటికి అవతల ఏమున్నదీ కనిపించటంలేదు.
2. పాండవులు అలసిపోయి ఉన్నారు. అప్పుడు భీముడు... తల్లిని, సోదరులను ఎత్తుకొని మహారణ్యంలో నడిచాడు.
3. భీముడికి చీకటి కాని, ముళ్లు కాని కనపడలేదు. వేగంగా నడిచాడు. అతడి నడకకు చెట్లు కదిలాయి. భూమి అదిరింది. భీముడు చల్లని మర్రి చెట్టు కిందకు వచ్చాడు. తల్లిని, సోదరులను ఆ చెట్టు కింద దించి, పడుకోబెట్టాడు.
4. అందరూ ఒడలు మరచి నిద్రించారు. భీముడు అప్రమత్తుడై వారిని రక్షిస్తున్నాడు.
5. భీముడు నీటి పట్టును తెలుసుకోవటం కోసం, మర్రి చెట్టు ఎక్కి, కొనకొమ్మలకు చేరి చూశాడు. దగ్గరలో ఒక సరస్సు కనిపించింది. తామరల వాసన వచ్చింది. హంసలు, తుమ్మెదలు ధ్వనులు చేశాయి.
6. భీముడు కొలను చేరి, స్నానం చేసి తామర దొన్నెలలో నీరు తెచ్చి, సోదరులకు ఇచ్చాడు. అప్పటికి సాయంకాలం అయింది. సూర్యుడు అస్తమించాడు. పక్షులు, జంతువులు, సర్పసమూహాలు బయటపడ్డాయి.
7. ఆ రాత్రి కుంతి, నలుగురు కొడుకులు నిద్రించారు. భీముడు కాపలా ఉన్నాడు.
8. దుష్టుల అండన నగరంలో ఉండటం కంటె, ఒంటరిగా అరణ్యాలలో ఉండటం మేలు. యోగ్యులు అడవిలోని చెట్ల వంటివారు. ఒకరిని ఒకరు ఆశ్రయించుకుని ఉంటారు. వృక్షాలు ఫలాలనిస్తాయి. యోగ్యుడు ఇతరులకు ఉపకారం చేస్తాడు. వృక్షాలు గట్టి వేర్లు కలిగి ఉంటాయి. యోగ్యుడు గొప్ప బుద్ధి కలిగి ఉంటాడు... అని భీముడు ఆలోచన చేశాడు.
–నిర్వహణ: వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment