
రణరంగంలోకి దూకి శత్రువులపై విల్లు ఎక్కుపెట్టి వీరోచితంగా పోరాడుతున్నారు విక్రమ్. మలయాళ దర్శకుడు ఆర్‌ఎస్. విమల్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ‘మహావీర్‌కర్ణ’ అనే మల్టీలింగ్వల్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహాభారతం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కర్ణుడి దృష్టికోణంలో సాగేలా కథను రెడీ చేశారట విమల్.
ఇటీవల ఈ సినిమా షూటింగ్ హైదాబారాద్‌లో ప్రారంభమైంది. కురుక్షేత్ర యుద్ధం నేపథ్యంలోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్‌ను 18 రోజుల పాటు ప్లాన్ చేశారట. త్వరలోనే ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్రబృందం. అదే టైమ్‌లో సినిమాలో భాగమైన ఇతర నటీనటుల వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారట.
Comments
Please login to add a commentAdd a comment