సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కు మద్ధతుగా చిత్ర పరిశ్రమ నుంచి పలువురు నటీనటులు ఇప్పటికే స్పందించారు. ఈ క్రమంలో కొందరు బన్నీ ఇంటికే కూడా వెళ్లి ఆయన్ను కలిసి వచ్చారు. తాజాగా ప్రభాస్ తన స్నేహితుడు అల్లు అర్జున్‌తో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. దీంతో ఇరువురి ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. కన్నడ హీరో ఉపేంద్ర కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. వీరిద్దరూ 'S/O సత్యమూర్తి' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా ఈరోజు అల్లు అర్జున్ ఇంటికి వెళ్తారని వార్తలు వచ్చాయి. కానీ, ఆయన సినిమా షూటింగ్ పనుల వల్ల హైదరాబాద్‌లో లేరని తెలుస్తోంది. దీంతో బన్నీకి ఫోన్ చేసి తన యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ ఉదయం నుంచి బన్నీ ఇంటికి చాలామంది సెలబ్రిటీలు క్యూ కట్టారు. ముఖ్యంగా చిరంజీవి సతీమణి సురేఖ, డైరెక్టర్ సుకుమార్ కంటతడి పెట్టడం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.
అల్లు అర్జున్ తప్పు చేయరు: శ్రీలీల
అల్లు అర్జున్ అరెస్టుపై నటి 'శ్రీలీల' కూడా రియాక్ట్ అయింది. ఆయన్ను అరెస్టు చేయడం బాధాకరమని ఆమె చెప్పారు. ఈ ఘటనతో నేను చాలా టెన్షన్ పడ్డాను. ఆయన ఎప్పుడు తప్పు చేయరు. న్యాయవ్యస్థను ఆయన గౌరవిస్తారు. కాబట్టి అల్లు అర్జున్‌కు మంచి జరిగింది. ఆయన పెద్ద స్టార్ అయినప్పటికీ భారత పౌరుడిగా మన వ్యవస్థలోని రూల్స్‌ను అందరిలాగే పాటించారు.' అని శ్రీలీల పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment