
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు ఓ రేంజ్‌లో అంచనాలు ఉంటాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన 'అతడు', 'ఖలేజా' వంటి చిత్రాలను ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్‌లో మూవీ వస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఇదిలా ఉంటే అల వైకుంఠపురములో సినిమాకు దాదాపు రూ.25 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకున్న మాటల మాంత్రికుడు ఈ సినిమా విజయంతో పారితోషికాన్ని రెట్టింపు చేశాడట. SSMB28వ సినిమాకు ఏకంగా రూ.50 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేశ్‌బాబు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం 50 కోట్ల రూపాయలు అందుకుంటున్నాడట. ఈ లెక్కన డైరెక్టర్ త్రివిక్రమ్ హీరోతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడన్నమాట!. కాగా సర్కారువారి పాట షూటింగ్ ముగిసిన వెంటనే మహేశ్‌బాబు త్రివిక్రమ్ సినిమాలో భాగం కానున్నాడు. దీనికోసం డైరెక్టర్ ఇప్పటినుంచే ప్రాజెక్టుకు మెరుగులు దిద్దే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment