
‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తారు. ముందు ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆరంభించాలనుకున్నారు. అయితే ప్రస్తుతం మహేశ్‌బాబు ‘సర్కారు వారిపాట’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ షూటింగ్ పూర్తికాగానే ఫ్యామిలీతో కలిసి ఈ వేసవిలో ఓ వెకేషన్‌ను ప్లాన్ చేశారట మహేశ్‌బాబు. ఈ వేసవి బ్రేక్ పూర్తయిన ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్న సినిమా షూట్‌లో పాల్గొంటారట మహేశ్‌బాబు. ఇక ‘సర్కారువారి పాట’ చిత్రం మే 12న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment