మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరుకారం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.మీనాక్షీ చౌదరి, ప్రకాశ్, రమ్యకృష్ణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.
(చదవండి: 'సలార్' రూట్‌లోనే 'గుంటూరు కారం'.. ప్లాన్ బాగుంది కానీ?)
తాజాగా ఈ చిత్రంలో నుంచి ‘కుర్చీని మడతపెట్టి..’ అనే మాస్ సాంగ్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ పాట ప్రోమోని నిన్న విడుదల చేయగా..ఎంత వైరల్ అయిందో తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వైరల్ అయిన ‘కుర్చీ మడతపెట్టి’ అనే పద ప్రయోగాన్ని వాడుకొని తమన్ బాణీ కట్టాడు. రామ జోగయ్యశాస్త్రి సాహిత్యం అదించారు. ప్రముఖ సింగర్స్ సాహితి చాగంటి, శ్రీకృష్ణ అద్భుతంగా ఆలపించారు.
ఈ పాటలో అదిరిపోయే బీట్‌లు మరియు గ్రామీణ ప్రాంతాల్లో మనం వినే జానపద శైలి సాహిత్యం ఉన్నాయి. ‘రాజమండ్రి రాగ మంజరి... మాయమ్మ పేరు తెల్వనోళ్లు లేరు మేస్తిరి" మరియు "తూనీగ నడుములోన తూటాలెట్టి ... తుపాకీ పేల్చినావే తింగరి చిట్టి... మగజాతినట్టా మడతపెట్టి..’ వంటి పదాలు మరియు పదబంధాలు 80ల నాటి సూపర్‌స్టార్ కృష్ణ గారి యొక్క క్లాసిక్ మాస్ చిత్రాలను గుర్తు చేస్తున్నాయి. పాట మధ్యలో 'ఏంది అట్టా సూత్తన్నావ్. ఇక్కడ ఎవడి బాధలకు వాడే లిరిక్ రైటర్. రాసుకోండి.... మడతెట్టి పడేయండి' అంటూ మహేశ్‌బాబు డైలాగ్ చెప్పడం విశేషం. మహేశ్‌బాబు, శ్రీలీల మాస్ స్టెప్పులతో అదిరిపోయిన ఈ వీడియో సాంగ్‌పై ఓ లుక్కేయండి.
Comments
Please login to add a commentAdd a comment