త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబు ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే. అతడు’(2005), ‘ఖలేజా’ (2010 ) చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో సినిమా ఇది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. SSMB28 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా నాన్ థియెట్రికల్ హక్కులను హాట్ కేకుల్లా అమ్ముడుపోయినట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం.
ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సంక్రాంతి రోజునే ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెటిప్లిక్స్ రూ.80 కోట్లు చెల్లించిందట.
అన్ని భాషలకు కలిసి ఈ భారీ మొత్తం ఇచ్చారట. థియేట్రికల్ విడుదల తర్వాత తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను తమ ఓటీటీ వేదికగా ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ విడుదల చేయనుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. ఈ ఏడాది దసరాకి థియేటర్స్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment