
హీరో మహేశ్‌బాబు–దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందనున్న మూడో సినిమా షూటింగ్ ఎప్పుడు ఆరంభమవుతుంది? అనే చర్చ కొన్నాళ్లుగా జరుగుతోంది. ‘అతడు, ఖలేజా’ తర్వాత మహేశ్–త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ఆగస్ట్‌లో ఆరంభిస్తామని ఈ చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) శనివారం తెలిపారు.
వచ్చే ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్లు కూడా వెల్లడించారు. పూజా హెగ్డే కథానాయికగా నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌ఎస్ తమన్, కెమెరా: పీఎస్ వినోద్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: ఏఎస్ ప్రకాశ్.
Comments
Please login to add a commentAdd a comment