Victory Venkatesh Next Movie With Jathi Ratnalu Director Anudeep, New Goes Viral - Sakshi
Sakshi News home page

త్రివిక్రమ్‌, తరుణ్‌ భాస్కర్‌ కాదు.. జాతి రత్నానికే వెంకీమామ గ్రీన్‌ సిగ్నల్‌

Published Tue, Mar 22 2022 11:10 AM | Last Updated on Tue, Mar 22 2022 11:49 AM

Victory Venkatesh Next Movie With Anudeep, New Goes Viral - Sakshi

గతేడాది విక్టరీ వెంకటేశ్‌ రెండు సినిమాల్లో నటించాడు. అయితే బ్యాడ్‌లక్‌ ఏంటంటే.. ఆ రెండు సినిమాలు(నారప్ప, దృశ్యం-2) ఓటీటీలో రిలీజ్‌ అయ్యాయి. ఇక చాలా కాలం తర్వాత ఎఫ్‌3 సినిమాతో థియేటర్స్‌ ప్రేక్షకులను పలకరించేందుకు వెంకీ సిద్దమవుతున్నాడు. మే 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా తర్వాత వెంకీ చేయబోయే కొత్త చిత్రంపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతుంది.

త్రివిక్రమ్‌, తరుణ్‌ భాస్కర్‌లతో సినిమాలు చేయాల్సి ఉన్నా.. ఇంకా ఫైనల్‌ కాలేదు. అన్నీ కూడా చర్చల దశలోనే ఉన్నాయి. ప్రస్తుతం వెంకటేశ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ కోసం రానానాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. రానా కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ వెబ్‌ సిరీస్‌ తర్వాత వెంకీ కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. అయితే అది త్రివిక్రమ్‌ లేదా తరుణ్‌  భాస్కర్‌తో కాదు. జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్‌తో మూవీ చేయబోతున్నాడట. ఇటీవల అనుదీప్‌ వెళ్లి వెంకీకి కథ వినిపించి ఇంప్రెస్‌ చేశాడట. ప్రస్తుతం ఈ దర్శకుడు తమిళ హీరో శివకార్తికేయన్‌తో తెలుగు తమిళ బైలింగువల్‌ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తైన వెంటనే వెంకీని డైరెక్ట్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని  ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement