త్రివిక్రమ్‌ డైరెక్షన్‌.. వెంకీ, నాని హీరోలు! | Venkatesh And Nani Multistarrer Movie Under Trivikram Direction | Sakshi
Sakshi News home page

వెంకీ-నానిలతో మల్టీస్టారర్‌ చిత్రం.. డైరెక్టర్‌ ఆసక్తి

Published Tue, May 26 2020 12:24 PM | Last Updated on Tue, May 26 2020 12:29 PM

Venkatesh And Nani Multistarrer Movie Under Trivikram Direction - Sakshi

విక్టరీ వెంకటేశ్‌, నేచురల్‌ స్టార్‌ నాని కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్‌ చిత్రం రాబోతుందని ఓ వార్త నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్ట్‌ చేయబోతున్నారని టాక్‌. ప్రస్తుతం యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో ఓ సినిమా కమిట్‌ అయిన త్రివిక్రమ్ ఈ చిత్రం తర్వాత వెంకీ-నానిలతో మల్టీస్టారర్‌ చిత్రం చేస్తారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్‌ చిత్రానికి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్‌ సిద్దం అవడంతో తరువాతి సినిమా గురించి కథా చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తున్నాయి. 

దీనిలో భాగంగా తనదైన శైలిలో ఫుల్‌ కామెడీ మూవీని ఇద్దరు హీరోలతో తెరకెక్కించాలని గురుజీ భావించారట. ఆ రెండు హీరోల పాత్రలు కామెడీ టైమింగ్‌ ఎక్కువగా ఉండే వెంకీ, నానిలు చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్‌ డిసైడ్‌ అయినట్లు సమాచారం. తను అనుకున్న స్టోరీ లైన్‌ చెప్పడానికి త్వరలోనే వెంకీ, నానిలను ఈ మాటల మాంత్రికుడు కలిసే అవకాశాలు కూడా ఉన్నాయని ఫిలింనగర్‌లో గుసుగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ చిత్రాన్ని త్రివిక్రమ్‌ హోం బ్యానర్‌ హారిక హాసిని క్రియేషన్స్‌తో పాటు సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.  వెంకీకి మల్టీస్టారర్‌ చిత్రాలు చేయడం కొత్తేం కాదు. ఇప్పటికే మహేశ్‌ బాబు, రామ్‌, వరుణ్‌ తేజ్‌, నాగ చైతన్యలతో కలిసి మల్టీస్టారర్‌ చిత్రాలు చేశారు. 

ప్రస్తుతం నారప్ప చిత్రంతో బిజీగా ఉన్న వెంకీ ఆ తర్వాత ఎఫ్‌3, తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. నాని కూడా రెండు మూడు చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాతనే త్రివిక్రమ్‌-ఎన్టీఆర్‌ సినిమా పట్టాలెక్కనుంది. దీంతో ఎన్టీఆర్‌ సినిమాకు చాలా సమయం ఉన్నందున వెంకీ, నాని చిత్రానికి సంబంధించి పూర్తి స్క్రిప్ట్‌పై కసరత్తులు చేయాలని త్రివిక్రమ్‌ అనుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి.  అయితే ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. 

చదవండి:
యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ‘నో పెళ్లి’
పారితోషికంకాదు.. పార్టనర్‌షిప్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement