Hero Venkatesh Next With Jathi Ratnalu KV Anudeep Direction Deets Here - Sakshi
Sakshi News home page

Venkatesh Movie: 'జాతిరత్నాలు' డైరెక్టర్‌తో వెంకీమామ.. త్వరలోనే అనౌన్స్‌మెంట్‌

Published Sat, Mar 19 2022 2:02 PM | Last Updated on Sat, Mar 19 2022 4:01 PM

Venkatesh Next With Jathi Ratnalu KV Anudeep - Sakshi

విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం​ 'ఎఫ్‌-3'. ఇటీవలె షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. ఈ క్రమంలో వెంకటేశ్‌ తన తదుపరి చిత్రానికి సంబంధించిన కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 'జాతిరత్నాలు' ఫేమ్‌ అనుదీప్‌ కేవి దర్శకత్వంలో సినిమా చేసేందుకు వెంకీమామ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం అనుదీప్‌ కోలీవుడ్‌ హీరో శివ కార్తికేయన్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిన వెంటనే వెంకటేశ్‌తో చేసే ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement